India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంచిర్యాల జిల్లానెన్నెల మండలంలోని కంబాల కుంట మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి మండలానికి చెందిన బలరాం(38) మృతిచెందగా, లంబడి తండాకు చెందిన నవీన్ తీవ్రంగా గాయపడ్డారు. శుభకార్యంలో పాల్గొని బెల్లంపల్లికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నవీన్ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మహారాష్ట్రకు చెందిన బృందంతో పాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి. శుక్రవారం ఉదయం కమ్మర్గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. సాయంత్రం మొర్లి గూడ అటవీ సమీపం నుంచి ప్రాణహిత నది తీరం దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్టు డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నట్లు ఇన్‌ఛార్జ్ FRO సుధాకర్ తెలిపారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లె పోశం తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 2న పోశంకు భార్యతో గొడవ జరగాగ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పోశం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తపాలా శాఖ IPPB (ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు)లో జరిగిన అక్రమాల తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లోని 74 మంది రైతులకు చెందిన పత్తి పంట విక్రయాల తాలూకూ డబ్బులను వారి ఖాతాల నుంచి తన సొంత ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించుకున్నట్లు తేల్చారు. ఇలా రూ.1.16 కోట్లు ఆయన స్వాహా చేసినట్లు తేల్చారు.
2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో బెల్ట్ షాపులపై టూటౌన్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు గణపతి, సుధాకర్, రాజు ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. తొమ్మిది రకాల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ రూ.14 వేల 490 ఉంటుందన్నారు. ఎస్సై లాల్ సింగ్ నాయక్, సిబ్బంది నరేష్, కిషన్, హరి ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి. చాందా (టి) గ్రామ సమీపంలో శుక్రవారం రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న 70 ఏళ్ల వృద్ధుడు రాందాస్‌ను ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాందాస్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటీ కిషన్, పైలెట్ ముజఫర్ లు క్షతగాత్రుణ్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి తనకు మార్కెట్ కమిటీలో స్థానం కల్పించినందుకు మాజీ మంత్రి జోగురామన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిర్మల్‌లోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం విధులకు రావాల్సిన స్పెషల్ అసిస్టెంట్లు 62 మంది గైర్హాజరయ్యారు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. మూల్యాంకనానికి విధులు కేటాయించబడ్డ ఉపాధ్యాయులు రేపటిలోగా (శనివారం) హాజరుకావాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 120 మంది సిబ్బందితో ట్రాకింగ్ నిర్వహిస్తున్నారు. థర్మల్ డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అడవిలో సంచరిస్తున్న ఏనుగును కెమెరాలో బంధించారు. ఇప్పటికే జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు అటవీ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.