India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
108లో అంబులెన్స్‌లో ఓ గర్భిణీ ప్రసూతి అయిన ఘటన సిర్పూర్ (U) మండలంలో జరిగింది. 108 EMT ఆత్రం రామేశ్వరి, పైలెట్ దయాకర్ తెలిపిన వివరాలు.. మత్తురతాండకు చెందిన జ్యోతికి పురుటి నొప్పులు రావడంతో కుటంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ రామేశ్వరి సహాయంతో జ్యోతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలింతను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని EMT తెలిపారు.
బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాసీమ కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు మైక్రో స్టేషన్ క్వారీకి వెళ్లింది. ఆమె భర్త షబ్బీర్ విషయం తెలుసుకుని జీఆర్పీ కానిస్టేబుల్ ఎండీ రషీద్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ ఘటనాస్థలికి చేరుకుని కాపాడాడు. ముగ్గురి ప్రాణాలను
కాపాడిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.
KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
సిరికొండ మండలం పొన్న ఎక్స్ రోడ్‌కు చెందిన పేందుర్ విమల బాయి (25) అనే నిండు గర్భిణీ మృతి చెందింది. బంధువుల వివరాలు.. విమల బాయికి రక్తహీనత, విరేచనాలు ఎక్కువ అవ్వడంతో ఇచ్చోడ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. 108లో మెరుగైన వైద్యం కోసం ADB రిమ్స్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
కొడుకు, కోడలు గొడవ పడుతుంటే వారించడానికి వెళ్లిన తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. స్థానిక చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న రాజుకు అతడి భార్య మధ్య గొడవ జరిగింది. రాజు తండ్రి రవీందర్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావంటూ రాజు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో తండ్రిపై దాడి చేశాడు.
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రత దృష్ట్యా, ప్రశాంతత పెంపొందించేందుకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, చేపట్టవద్దని డీజేలు, వాడరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రెండ్రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
మంగళవారం ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణం కనిపించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు మేఘావృతమై చల్లటి వాతావరణం కనిపించగా 8 గంటల తర్వాత సూర్యుని ప్రతాపం కనిపించింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 4 గంటల తర్వాతా ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడి చల్లటి గాలులు వీచాయి రాత్రి 8 గంటల తర్వాతా ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
జైనూర్ మండలం లక్ష్మణ్ పటేల్‌గూడకు చెందిన ఆత్రం లక్ష్మి(30) అనే నిండు గర్భిణీ దగ్గు, దమ్ముతో అకస్మాత్తుగా మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు.. లక్ష్మీకి దమ్ము, దగ్గు అధికం కావడంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆక్సిజన్ ద్వారా 108లో మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఒకేసారి దమ్ము, దగ్గు రావడంతో చనిపోయిందని చెప్పారు.
లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ ఆదేశించారు. బెజ్జూరు పోలీస్ స్టేషన్‌ను నేడు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి పార్టీలు, వ్యక్తులకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్ట్ విధుల్లో ఉంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.