India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MPఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆదిలాబాద్ పరిధిలో 12 మంది అభ్యర్థులు మిగిలారు. నిన్న స్వతంత్ర అభ్యర్థి రాఠోడ్ రాజు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. రిటర్నింగ్ అధికారి, సాధారణ పరిశీలకుల సమక్షంలో వీరికి గుర్తులు కేటాయించారు. పెద్దపల్లి లోక్ సభ స్థానానికి 42 మంది బరిలో నిలిచారు. నిన్న ఏడుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం కానున్నాయి.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబందించి ఏమైనా సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించవచ్చని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద తెలిపారు. ఫిర్యాదు చేయదలుచుకున్న వారు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు 8143876383 నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. నేరుగా ఫిర్యాదు చేయదలచిన వారు ఆదిలాబాద్‌లోని పెన్ గంగా గెస్ట్ హౌస్‌లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా మైక్రో అబ్జర్వర్స్
ర్యాండమైజేషన్‌ను సాదారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. అదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ల వారిగా అదిలాబాద్ 14, బోథ్ 30, ఆసిఫాబాద్ 24, సిర్పూర్ 16, నిర్మల్, 30, ఖానాపూర్ 49, ముదోల్ 27 మొత్తం 190 మైక్రో అబ్జర్వర్స్‌ను కేటాయించారు.
ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం కోసం జరుగుతున్న ఎన్నికల్లో 12 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మెత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వారిలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మిగిలని 13 మంది అభ్యర్థుల్లో సోమవారం స్వతంత్ర అభ్యర్థి రాజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో మొత్తం 12 మంది నిలిచారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. నేడు జన్నారంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా రంజన్ల తయారీకి పెట్టింది పేరు. నీటిని చల్లబరచడంలో ప్రత్యేకత కలిగినవి కావడం, ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో గిరాకీ బాగుంటుంది. వీటి తయారీని కుమ్మరులు ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తారు. వీటిపై ఆధారపడి జిల్లాలో వందల సంఖ్యలో జీవనం సాగిస్తున్నాయి. వీటి తయారీలో కుమ్మరుల కళ, నైపుణ్యం ఉట్టిపడుతుంది. రంజన్లు విభిన్న రూపాల్లో, యంత్రాలకు దీటుగా తయారై ఆకట్టుకోవడంతో భలే గిరాకీ ఉంటుంది.
వర్షం వస్తే జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నెలల తరబడి వాగులు దాటాల్సిన దయనీయ పరిస్థితులు. రేషన్ తెచ్చుకోవాలన్నా, ఇతర పనులకు వెళ్లాలన్నా నరకమే. ఏటా ఎన్నో గ్రామాలు వేదన పడుతున్నా పాలకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
ADB, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. ఇందులో కొందరు ర్యాలీలు నిర్వహించి నామినేషన్లను దాఖలు చేయగా.. ఎన్నికల ఖర్చుల లెక్క చూపాల్సి ఉంటుందని మరికొందరు సాదాసీదాగా వేశారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదనే నిబంధన పెట్టింది. పరిమితి దాటితే ఎన్నికైనా సరే పదవికి ఎసరు తప్పదు. గతంలో రూ.70 లక్షలు ఉండేదాన్ని రూ.95 లక్షలకు ఎన్నికల సంఘం పెంచింది.
మందమర్రి మండలం బొక్కలగుట్టలోని ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన సురేందర్ సింగ్ అనే కూలీ మద్యానికి బానిసై మృతి చెందాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన మృతుడు రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి ఒడిశాకు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు.
జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పనిచేస్తున్న 2107 మంది ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల శిక్షణ కార్యక్రమం మే1 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. తేదీల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ శిక్షణ కార్యక్రమం కు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.