India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటి గ్రామీణులు తాగునీటికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా చోట్ల బోరు బావుల్లో నీరు ఇంకిపోగా వాంకిడి మండల కేంద్రంలోని పలు బావుల్లో నీరు సమృద్ధిగా ఉండి దాహం తీరుస్తున్నాయి. మండలంలోని పెర్కవాడ బావి, తేలివాడలోని బావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో వీటిపైనే కాలనీవాసులు ఆధారపడుతున్నారు. తేలివాడలోని ఒక బావికి ఏకంగా 14 మోటార్లను బిగించుకుని నీటిని
వాడుకుంటున్నారు.
ADB, పెద్దపల్లి ఎంపీ స్థానాలకు ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది నేడు తేలనుంది. ADB ఎంపీ స్థానానికి 23 మంది నామినేషన్లు వేశారు. 10 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 13 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి 63 మంది నానినేషన్లు వేశారు. 14 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామపత్రాల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎందరు పోటీలో ఉన్నారో అధికారులు ప్రకటిస్తారు.
ఇంటర్ ఫెయిల్ కావడంతో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ప్రథమ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4 సబ్జెక్టుల్లో అనుత్తీర్ణుడు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో క్షణికావేశానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ తెలిపారు.
కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట శవంతో ఓ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శ్వేత అనే గర్భిణీని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేయగా గర్భంలోనే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృత శిశువును తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా వైద్యులు నిర్లక్ష్యం చేశారు. సాయంత్రం సిజేరియన్ చేసి శిశువును తొలగించారు. శ్వేత ఆరోగ్యం విషమించగా మంచిర్యాలకు తరలిస్తుండగా మృతి చెందింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 2న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసిఫాబాద్‌కు రానున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఆదివారం తెలిపారు. స్థానిక ప్రేమల గార్డెన్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరిస్తారని తెలిపారు.
తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న తండ్రిని చంపిన హత్య కేసులో నిందితుడైన కొడుకు సాయిలును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సోన్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. మాదాపూర్ గ్రామానికి చెందిన నడిపి ఎల్లయ్యకు శనివారం రాత్రి భార్య చిన్నక్క అన్నం పెట్టడం ఆలస్యం కావడంతో కర్రతో కొట్టాడు. తల్లిని చిత్రహింసలకు గురిచేయడాన్ని తట్టుకోలేక సాయిలు తండ్రిని కొట్టి చంపాడు.
వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన జన్నారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని వినాయక్ నగర్‌కు చెందిన మేడిశెట్టి మహేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం దేవాలయానికి వెళ్లే క్రమంలో వడదెబ్బ తగలడంతో మహేశ్ పోన్కల్ ప్రాంతంలో ఉన్న ఓ డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరొకరు ఆత్రం సుగుణ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ అయిదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివారు. తమ గ్రామానికే చెందిన ఎంపీ వెంకటేశ్‌నేతను స్ఫూర్తిగా తీసుకొని, భర్త ఆత్రం భుజంగరావు సహకారంతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు సుగుణ చెప్పారు.
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాజర్షిషాపై బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, ఆశిష్.. సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గోడంనగేశ్ ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు నమోదు చేయలేదని, ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఈవో దృష్టికి తెచ్చారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవలన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు అగ్ర నేతలతో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రానికి మే 5న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం రానున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.