Adilabad

News April 28, 2024

ఆదిలాబాద్: ఎండలు మండుతున్నాయి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 43, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 44.5 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నా వేళలో అవసరముంటే తప్ప బయటకు రావద్దని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

News April 28, 2024

వాంకిడి: సాంస్కృతి సంప్రదాయాలతో మంత్రి సీతక్కకు స్వాగతం

image

వాంకిడి మండలంలో మంత్రి సీతక్కకు మరియు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఆత్రం సుగుణకు సాంస్కృతి సంప్రదాయాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజలు శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆడ బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సుగుణను మెజారిటీతో గెలిపించాలని కోరారు.

News April 27, 2024

నార్నూర్‌లో పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

నార్నూర్ మండలంలోని చొర్గావ్ గ్రామానికి చెందిన మలక్ సింగ్(38) పురుగు మందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ రవికిరణ్ తెలిపారు. మలక్ సింగ్ ఈ నెల 20న మద్యం తాగి ఇంట్లో తల్లిదండ్రులు, భార్యతో గొడవ పడ్డాడు. కుటుంబీకులు మందలించడంతో అతడు పురుగులమందు తాగాడు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 27, 2024

ADB జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుల కోసం ఇన్‌ఛార్జ్‌ల నియామకం

image

ఈ నెల 25 నుంచి మే 8 వరకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. ఫిర్యాదుల కొరకు మానిటీరింగ్ సెల్ ఇన్‌ఛార్జ్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఓటరు స్లిప్‌ల పంపిణీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌ నం:7670858440, బోథ్ సెగ్మెంట్ నం:9440995663, జిల్లాస్థాయి ఫిర్యాదు కోసం నం:1950, 18004251939 లను సంప్రదించాలని సూచించారు.

News April 27, 2024

ఆదిలాబాద్: రేపే లాస్ట్.. APPLY NOW

image

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లొమాల్లో ప్రవేశంకోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 24న నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు అన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు.

News April 27, 2024

KZR: అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో అనుమానాస్పద స్థితిలో సంజీవయ్య కాలనీకి చెందిన బొమ్మెన వినోద్(30) మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.

News April 27, 2024

నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ఇంద్రవెల్లి మండలం ధనోర(బి)లో నిన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న నార్నూర్ మండలం చోర్‌గావ్‌కు చెందిన అడ మధుకర్, దుర్వ చందు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిని చికిత్స నిమిత్తం 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారు ఇవాళ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 27, 2024

మందమర్రి: కుటుంబ కలహాలతో సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

మందమర్రి ప్రాణహిత కాలనీలో మేడ మహేష్(55) అనే సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మద్యానికి బానిసైన మహేష్ కూర విషయంలో భార్య, కొడుకుతో శుక్రవారం గొడవ పడ్డాడు. దీంతో ఇంటి బయట కుటుంబ సభ్యులు ఉండగా గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ శశిధర్రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News April 27, 2024

నేరడిగొండ: వైన్స్‌లో అర్ధరాత్రి దొంగతనం

image

నేరడిగొండ మండలంలోని వరుణ్ లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు షట్టర్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.27,800 నగదు రూ. 4700 విలువచేసే మద్యం బాటిళ్లతో ఉడాయించారు. చోరీ విషయాన్ని గుర్తించిన వైన్స్ యజమానులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI శ్రీకాంత్ తెలిపారు.

News April 27, 2024

ADB: ఏఈ పరీక్ష ఫలితాల్లో జిల్లావాసి ప్రతిభ

image

జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన అల్లూరి సవిత, రాఘవేందర్ రెడ్డిల కుమారుడు రంజిత్ ఏఈ పరీక్ష ఫలితాలు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 2023 అక్టోబర్‌లో రాసిన పరీక్ష తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్ష ఫలితాల్లో రంజిత్ రాష్ట్రంలో ఏడో ర్యాంకు, జోనల్ స్థాయిలో రెండో ర్యాంకు, బాసర జోన్‌లో మొదటి ర్యాంకు సాధించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.