India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ADB జిల్లా భీంపూర్ మండలం గోవింద్‌పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు బావుల నీటినే వినియోగించేవారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత సమస్యతో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో గ్రామస్థులు ఊరిని వదిలి వెళ్లిపోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్మల్ 43.5 డిగ్రీల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలో 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. జిల్లాలోని బైంసా మండలం వానల్ పాడ్, నర్సాపూర్ మండలంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాండూరులోని సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ <<12972348>>హత్యకు గురైన<<>> విషయం తెలిసిందే. అతడి ఫోన్ సిగ్నల్స్ ద్వారా IBలోని ఓ కాలనీకి చెందిన దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. మార్చి 31 రాత్రి అజ్గర్‌ను ఇంటికి పిలిచి తలపై రాడ్డుతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. తన భార్యను అజ్గర్ ప్రేమ పేరుతో వేధించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఆ ముగ్గురిని ASF సబ్ జైలుకు తరలించారు.
అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాద్యాయుడు మహేందర్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ప్రణీత మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్చి నెల 9 నుంచి 14 వరకు స్కూల్ అసిస్టెంట్ మహేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లారని ఆయనపై పీఆర్టీయూ తెలంగాణ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతడిపై విచారణ జరిపించి వేటువేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మంచిర్యాల జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరాకు అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మండల, గ్రామ, వార్డుస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం సోమవారం లభించినట్లు CI కుమారస్వామి తెలిపారు. తాండూర్ IB సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ అలీ(33) శనివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అబ్బాపూర్ ఓసీపీ పరిసరాల్లో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఇది హత్యా? లేకా ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు CI వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బైంసా మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా కాండ్లి గ్రామానికి చెందిన గంప గణేశ్(45) భైంసాకు వస్తున్న క్రమంలో టాక్లి గ్రామ శివారులో బైకు అదుపు తప్పి కిందపడినట్లు తెలిపారు. అతడి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సాధించి ఆల్ టైం రికార్డ్ ఆర్థిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70.02 మిలియన్ టన్నులు సాధించడంతోపాటు అదే స్థాయిలో 69.86లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంస్థ C&MD బలరాం నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన అధికారిని నియమించారన్నారు.
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగించారన్నారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ వద్ద చేపల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం.. ఎదురుగా వస్తున్న మరో బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.