India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని లక్ష్మీ పూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదిలాబాద్ వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాక, మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే వారిని 108 వాహనం ఈఎంటీ కిషన్, పైలెట్ విట్టల్ గౌడ్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. ఈ మేరకు రామగుండం సీపీ ఎం శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే మూల్యాంకనం నిర్వహణకు ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్కూల్ అసిస్టెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు. మూల్యాంకన కేంద్రంలో సెల్ ఫోన్లు వాడవద్దని సూచించారు.
బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణను పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు. మతతత్వ రాజకీయాలు చేసి బీజేపీ ని ఓడించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ తదితరులున్నారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ సమీపంలోని వాగులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం నర్సాపూర్ సమీపంలోని చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక పోలీసులు బయటకు తీసినట్లు సమాచారం. మృతదేహానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గాంధీని చంపిన గాడ్సేకు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే దండగ.. బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాదన్నారు. ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు.
బెజ్జుర్ మండలంలోని లంబడిగూడ శివారులోని ప్రాణహిత నదిలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటడంతో ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. గత మూడు పర్యాయాల్లో ఫలితాలను పరిశీలిస్తే ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవలేదు. 2009లో TDP, 2014లో BRS, 2019లో బీజేపీ గెలిచింది. ఈసారి బీజేపీ-గోడం నగేశ్, బీఆర్ఎస్-ఆత్రం సక్కు, కాంగ్రెస్-ఆత్రం సుగుణ బరిలో ఉండగా.. మన ఆదిలాబాద్ ప్రజలు ఈసారి ఎటువైపు ఉంటారో చూడాలి.
వేడి నూనె పడి యువకుడు మృతి చెందిన ఘటన చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐమాజీద్ తెలిపిన వివరాల ప్రకారం.. సుందర శాలకు చెందిన సురేశ్(30) మద్యం మత్తులో మార్చి నెల 25న చేపలు ఫ్రై చేస్తుండగా ముఖంపై వేడి నూనె పడింది. దీంతో గాయపడిన అతడిని కుటుంబీకులు మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సురేశ్ ఆదివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. మార్చి 31 తేదీ వరకు ఉన్న గడువును ఏలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడగించారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
>>SHARE IT
Sorry, no posts matched your criteria.