Adilabad

News May 26, 2024

నిర్మల్: త్వరలో IIIT నోటిఫికేషన్: VC

image

నిర్మల్ జిల్లాలోని బాసర RGUKTలో ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వంతో ఈ నోటిఫికేషన్ గురించి చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతి రాగానే త్వరలో PUC మొదటి సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు.

News May 26, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య

image

చింతలమానెపల్లిలో <<13313894>>దారుణహత్య<<>> జరిగింది. కోర్సిని గ్రామానికి చెందిన సదయ్య(34)కు 12 ఏళ్ల కిందట కవితతో పెళ్లి అయింది. సదయ్య అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఆ మహిళతో కూడా గొడవలు రావడంతో ఆమె అతడిని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా గ్రామానికి వచ్చిన ఆ మహిళను కలవడానికి వెళ్లగా ఆమె సొదరుడు కుమార్ అతడిపై రాడ్‌తో దాడి చేసి చంపేశాడు.

News May 25, 2024

ఆదిలాబాద్: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

image

పలు జిల్లాల్లో దొంగతనాలు చేసిన నిందితుడిని సిద్దిపేట 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన రామారావు సిద్దిపేట 2 టౌన్, 3 టౌన్, చేర్యాల PSల పరిధితో పాటు ఆయా స్టేషన్లలోని మొత్తం 24 దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 47.70 తులాల బంగారం, 65 తులాల వెండి, రూ.34,500, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News May 25, 2024

ఆదిలాబాద్: పదిరోజుల్లో ఫలితాలు.. MPఎవరో?

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈనెల 13న ముగిసింది. పోలింగ్ జరిగి నేటికి 12 రోజులు కావస్తుండగా ఫలితాలు మరో 10 రోజుల్లో జూన్ 4న వెలువడనున్నాయి. ఇక ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మేమే గెలుస్తున్నామన్న ధీమాలో ఎవరికి వారు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఎవరు పార్లమెంట్‌లో అడుగు పెడతారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.
-మరి గెలిచేదెవరో మీ కామెంట్

News May 25, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య..?

image

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. చింతలమానేపల్లి మండలం కోర్చిని గ్రామానికి చెందిన సదయ్యను కుమార్ అనే వ్యక్తి రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

News May 25, 2024

నిర్మల్ జిల్లాలో గతేడాది 98 మందిపై కేసు: ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట పేకాటాడుతూ పట్టబడుతున్నారని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. కాగా 2023లో 605 మంది జూదరులు పట్టుబడగా 98 మందిపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. వారి వద్ద రూ.15,48,515 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పేకాటను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేశామన్నారు.

News May 25, 2024

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య

image

ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అదే మండలంలోని సర్వాయి పేటకు చెందిన రాజేశ్(28), నాయిని చీకటి అనే వివాహిత కొంత కాలంగా కలిసి ఉంటున్నారు. శుక్రవారం ఇంటి యజమాని తలుపు తెరిచి చూడగా వారిద్దదూ ఉరేసుకొని చనిపోయి ఉన్నారు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రూరల్ CI సుధాకర్ ఈ ఘటన పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 25, 2024

శ్రీరాంపూర్: నేత్రదానంతో ఇద్దరి కళ్లలో వెలుగులు

image

శ్రీరాంపూర్ ఆర్కే 6 కాలనీకి చెందిన సింగరేణి మాజీ ఉద్యోగి పోతునూరి సత్యనారాయణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ క్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి ఆద్వర్యంలో సత్యనారాయణ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. సమాజ హితం కోసం విషాదంలో కూడా మృతుని నేత్రాలను దానం చేసిన వారిని ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు.

News May 24, 2024

ఆదిలాబాద్: 518 షాపులకు లైసెన్స్‌లు

image

లైసెన్స్ కలిగిన దుకాణాల్లో రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోళ్లు చేయాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లాలో 518 షాపులకు లైసెన్స్‌లు ఇచ్చామన్నారు. జిల్లాలో 4 లక్షల 50 వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు అంచనా వేశామన్నారు. 10 లక్షల ప్యాకెట్లు అవసరమని గుర్తించి 55 కంపెనీలతో మాట్లాడి 8 లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కొనుగోలు చేశారన్నారు.

News May 24, 2024

గాదిగూడ: కలుషిత నీరు తాగి 8 మందికి అస్వస్థత

image

కలుషిత నీరు తాగి 8 మంది అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం గాదిగూడ మండలం లోకారి (బి)లో చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ తెలిపిన ప్రకారం లోకారి (బి) లో కలుషిత నీరు తాగి 8 మందికి అస్వస్థకు కావడంతో ప్రథమ చికిత్స అందించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించినట్లు వెల్లడించారు.