Adilabad

News May 24, 2024

భైంసా: మంటలు అంటుకొని వృద్ధురాలు మృతి

image

ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుంబి గ్రామానికి చెందిన నార్వాడే చేంద్రబాయి (70) సోమవారం ఇంటి ముందు చెత్తను ఊడ్చి మంట పెట్టింది. ప్రమాదవశాత్తు మంటలు చీరకు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు.

News May 24, 2024

నిర్మల్: విద్యుత్ తీగలు పడి బాలికకు గాయాలు

image

నిర్మల్ జిల్లాలో విషాదం. విద్యుత్ స్తంభం విరిగిపడి బాలికకు తీవ్రగాయాలైన ఘటన సారంగపూర్ మండలం కౌట్ల (బి) గ్రామంలో జరిగింది. గమనించిన స్థానికులు బాలికను నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. చెట్లు కొమ్మలు తొలగిస్తుండగా విద్యుత్ తీగలు బాలిక పై పడి ప్రమాదం జరిగనట్లు తెలిపారు.

News May 24, 2024

ADB: Ed.CET రాసేందుకు వచ్చిన యువతి MISSING

image

Ed.CET పరీక్ష రాయటానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. పట్టణ టూ టౌన్ SI లాల్ సింగ్ నాయక్ తెలిపిన వివరాలు.. నిర్మల్‌కు చెందిన ఓ యువతి తన తండ్రితో ఆదిలాబాద్‌లోని నలంద కళాశాలలో పరీక్ష రాసేందు వచ్చింది. ఇద్దరూ బస్టాండ్లో దిగిన అనంతరం మూత్రశాలకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. పలు చోట్ల తండ్రి గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News May 24, 2024

నిర్మల్: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 3,416 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 2,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

News May 24, 2024

560 గ్రాములతో పుట్టిన పాపకు ట్రీట్మెంట్

image

ఆదిలాబాద్‌కు చెందిన ముస్కాన్ రిజ్వాన్ దంపతులకు రెండు నెలల క్రితం 560 గ్రాములతో పాప జన్మించింది. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో.. నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు పాపకు రెండు నెలల పాటు చికిత్సలు నిర్వహించి, బరువు కిలో 465 గ్రాముల వరకు పెరిగేలా చేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉండడంతో బేబీని డిశ్చార్జ్ చేశారు.

News May 23, 2024

ADB: పర్స్ కొట్టేసిన మహిళా దొంగ.. అరెస్టు

image

ఆదిలాబాద్ RTC బస్ స్టాండ్ నుంచి గురువారం బేల వెళ్ళటానికి సయ్యద్ అనే వ్యక్తి బస్సు ఎక్కుతుండగా ఒక మహిళ ఆయన పర్సును దొంగిలించింది. ఈ క్రమంలో ఆమె పారిపోతుండగా అక్కడున్న టూటౌన్ పోలీసులు ఆమెను పట్టుకొని పర్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టౌన్‌లో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు CI అశోక్ తెలిపారు. SI లాల్ సింగ్ నాయక్, సిబ్బంది గంగకుమారి, రజిత, నరేష్, రమేష్, క్రాంతి, నరేందర్ ఉన్నారు.

News May 23, 2024

భైంసా: మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు..!

image

మనస్తాపంతో ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కథనం మేరకు మాటేగాంకి లక్ష్మణ్(3౦) కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 22న ఓ ఫ్లాట్ విషయంలో భార్యతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన లక్ష్మణ్ గురువారం మాటేగాం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News May 23, 2024

నెన్నెల వాసికి రూ.కోటి జీతంతో ఉద్యోగం

image

నెన్నెల మండలం గుడిపేటకు చెందిన మాలోతు తిరుపతి (28) ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో PHD పట్టా పొందారు. దీంతో బుధవారం ధర్డ్ వేవ్స్ సిస్టమ్ రీసెర్చ్ మేనేజర్‌గా ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగం లభించింది. తిరుపతి తల్లిదండ్రులు రాంచందర్, శకుంతల నిరక్షరాస్యులు. వ్యవసాయం చేస్తూ వారి ఇద్దరు కుమారులను చదివించారు.

News May 23, 2024

ADB: ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను అభివృద్ధి చేస్తాం: పీవో

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను బలోపేతం చేయటంతో పాటు అభివృద్ధి చేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని జంబుగాలో ఉన్న ఐటీడీఏ ఉద్యాన నర్సరీ, శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. నర్సరీ ద్వారా మెరుగైన ఆదాయం పొందటంతో పాటు, దినసరి కూలీలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఓ సూచించారు.

News May 22, 2024

ఆదిలాబాద్: ట్రాక్‌పై చెట్టు.. రైళ్లకు అంతరాయం

image

జిల్లాలోని తలమడుగు మండలం కోసాయి వద్ద గాలివాన కారణంగా చెట్లు రైలు పట్టాలపై పడిపోయాయి. దీంతో రాత్రి 7 గంటల వరకు ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సిన ఇంటర్‌సిటీ రైలును మహారాష్ట్రలోని కిన్వట్ వద్ద నిలిపివేశారు. ఇదే రైలు ఆదిలాబాద్‌కు వచ్చి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌గా 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రైలు పట్టాలపై చెట్లు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాస్తున్నారు.