Adilabad

News May 21, 2024

కాగజ్‌నగర్‌లో యువకుడి దారుణ హత్య 

image

స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కాగజ్‌నగర్‌లోని గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో వారు గొడవ పడ్డారు. దీంతో నలుగురు యువకులు చంద్రశేఖర్‌(28)ను తలపై రాయితో కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఈజ్‌గాం SI రామన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News May 21, 2024

ఆదిలాబాద్: 4 రోజులు కొనుగోలు బంద్

image

ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మేరకు జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మద్దతు ధరతో చేపడుతున్న జొన్నల కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు కొనుగోళ్లు నిలివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 26 నుంచి కొనుగోళ్లు చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని సూచించారు.

News May 21, 2024

ఆదిలాబాద్: ఓటేయడానికి ముందుకురాని మహిళలు

image

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 8,45,213 మంది ఉన్నారు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో 6,22,420 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి పోలింగ్ 73.64 శాతంగా నమోదైంది. అలాగే పురుష ఓటర్లు 8,04,875 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,99,108 మంది ఓటు వేశారు. వీరి పోలింగ్ శాతం 74.43గా నమోదైంది. 2,05,767 మంది పురుష ఓటర్లు ఓటు వేయలేదు. మహిళలే తక్కువ ఓటేశారు.

News May 20, 2024

ఆదిలాబాద్: ఓపెన్ యూనివర్సిటీ RESULT OUT

image

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడవ సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ టి. ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులు పరీక్షలు రాయగా సోమవారం ఫలితాలు విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

News May 20, 2024

కోటపల్లి: పట్టుబడిన అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు

image

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్‌ పల్లి, సిరోంచ వంతెన చెక్‌పోస్టు వద్ద సోమవారం అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో చిరుతపులి చర్మం తరలిస్తున్న దుర్గం పవన్‌, బాబర్ ఖాన్‌ను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి చిరుతపులి చర్మంతో పాటు రెండు మోటారు సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News May 20, 2024

ఆదిలాబాద్: ఒకేరోజు రెండు పరీక్షలు… రాసేదెలా?

image

పలువురు విద్యార్థులకు ఒకేరోజు టెట్, డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 30న KUకి సంబంధించిన డిగ్రీ Bsc, BA అలాగే అదే రోజు టెట్ పరీక్ష ఉంది. దీంతో డిగ్రీ పరీక్ష రాయలా? టెట్ పరీక్ష రాయలా?, రెండు రాసేదెలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష రాస్తే డిగ్రీ సప్లిమెంటరీకి విద్యార్థులకు మరో సంవత్సరం ఆగాల్సి వస్తుంది. టైం టేబుల్ మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

News May 20, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.1.41 కోట్లు కేటాయింపు

image

కేజీబీవీలకు సంబంధించి గత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలకు గాను నిధులు విడుదల చేస్తూ తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షణ నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. ఛార్జీల విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రత్యేకాధికారులకు కాస్త ఉపశమనం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలకు రూ.1.41 కోట్లు కేటాయించారు. తాజాగా నిధులు విడుదల కావడంతో బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమమైందని ఎస్‌వోలు పేర్కొన్నారు.

News May 20, 2024

ఇచ్చోడలో భార్యను చంపిన భర్త

image

భార్యని భర్త హత్య చేసిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం సత్వాజీగూడకు చెందిన రేణుక(28)కు, ఇచ్చోడ మండలం గాంధీనగర్‌కు చెందిన వెంకట్‌తో 2015లో వివాహమైంది. మద్యానికి బానిసైన వెంకట్ డబ్బుల కోసం శనివారం భార్యతో గొడవ పడ్డాడు. ఆమె నిరాకరించడంతో మద్యం మత్తులో ఆమె మెడకు తాడు బిగించి హత్య చేసి పరారైనట్లు CI భీమేశ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News May 20, 2024

బోథ్‌లో 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు SI రాము తెలిపారు. బోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయం వద్ద ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News May 19, 2024

2 Hr’s పాటు నిలిచిపోయిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్

image

హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. అందులో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌ను ఉప్పల్ స్టేషన్‌లో నిలిపివేశారు. తర్వాత అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌ను నిలిపివేశారు. రెండు గంటలు రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.