India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుబీర్ మండలంలోని పార్డి(కె) గ్రామానికి చెందిన విద్యార్థి బందెల అజయ్ (18) హైదరాబాదులో ప్రమాదానికి గురై మృతిచెందాడు.. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నాడు.. రెండ్రోజుల క్రితం ఆటోలో ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
Way2News కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈనెల 17న ఆదిలాబాద్ సుభాష్ నగర్ కాలనీలో “మురికి కాలువ శుభ్రం చేసుకుంటున్న యజమానులు” అనే శీర్షికతో వార్త ప్రచురితమయ్యింది. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో నాళాలను శుభ్రం చేయించారు. అలగే మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ సైతం నాళాలు తీసిన కుటుంబీకులతో మాట్లాడి ఏమైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తుల సెగ ఆయా పార్టీల్లో తల నొప్పిగా మారింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో మాజీ ఎంపీ గోడం నగేష్‌కు టికెట్ కేటాయింపుతో విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ, నేతల మధ్య అనైక్యత పార్టీకి తలనొప్పిగా మారింది.
నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి జాతీయ రహదారి పై గల బస్ స్టేషన్ వద్ద గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. ఆ వ్యక్తికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. చామనఛాయతో ఉన్న ఈ వ్యక్తి బిక్షాటన చేసేవాడని ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
ADB ఎంపీ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ 7, TDP 6 సార్లు, TRS 2 సార్లు గెలుపొందాయి. మరోవైపు కాంగ్రెస్ (ఐ), సోషలిస్టు పార్టీ, బీజేపీ ఒక్కోసారి విజయం సాధించాయి. తొలి ఎన్నికల్లోనే సోషలిస్ట్ నుంచి బరిలో ఉన్న మాధవరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. గడిచిన 4 ఎన్నికలను పరిశీలిస్తే.. ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ వచ్చారు. మరి ఈ ఎన్నికలో ఎవరిని గెలిపిస్తారో చూడాలి మరి.
రెబ్బెన మండలం దేవులగూడా సమీపంలో గురువారం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వెనుకాల ఢీకొన్న లారీ పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
కాంగ్రెస్ మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుకు లేదని కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రావి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల పైన అసత్యపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి ఆదరణ లభించకపోవడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరగనున్న ఓపెన్ ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేవం నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు 5, 10వ తరగతికి 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా చర్యలు చేపట్టమన్నారు.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఏడీఆర్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు శ్యామ్ లాల్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్‌కు చెందిన రాథోడ్ సుభాష్ పాలనాధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఈ నెల 21న మధ్యాహ్నం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బాలుర సీనియర్స్ పుట్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్ల పుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ రెడ్డి తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, 3 ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.