Adilabad

News May 18, 2024

ఆసిఫాబాద్: ‘ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య’

image

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ ఘటన ASFలోని రహాపెల్లిలో జరిగింది. చునార్కర్ రవీందర్(38), కళావతి భార్యభర్తలు. కళావతి అదే గ్రామానికి చెందిన అక్కపెల్లి రవీందర్‌తో తరచూ ఫోన్ మాట్లాతుందన్న అనుమానంతో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండేది. గురువారం ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లో ఉరేసి చంపేసిందన్న అనుమానంతో రవీందర్ అన్న ఆనందరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై SI రాజేశ్వర్ కేసు నమోదు చేశారు.

News May 18, 2024

ASF: పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఇచ్చే పురస్కారాలకు 6-18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. పలు రంగాల్లో ప్రతిభ చూపిన బాలలు జులై 31లోపు http //awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 17, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ అభ్యర్థి నగేశ్

image

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి నగేశ్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్లమెంటు పోలింగ్ సరళి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు. అదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మనం గెలవబోతున్నామని, అందుకు గాను ముందస్తు అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు పార్లమెంట్ కో ఇన్‌ఛార్జ్ అశోక్ ముస్తాపురే, జిల్లా బీజేపీ నాయకులు, తదితరులున్నారు.

News May 17, 2024

నిర్మల్: రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు

image

హైదరాబాద్‌లోని శ్రీ నీలకంఠ విద్యాపీఠంలో ఈ నెల 16, 17తేదీల్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్రస్థాయి అభ్యాస వర్గలో జిల్లాకు చెందిన పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర, విద్య ఆధారంగా జాతి నిర్మాణం, దేశభక్తి, నూతన జాతీయ విద్యావిధానం, ఆదర్శ ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వంటి పలు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తపస్ నాయకులు తెలిపారు.

News May 17, 2024

ఆదిలాబాద్: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

News May 17, 2024

ఆదిలాబాద్: ఓట్లు లెక్కపెట్టేది ఇక్కడే

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న ఫలితాల కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వివరాలు.. ★ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు: సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ★ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ ఓట్లు : ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ★ ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ ఓట్లు: TTDCలో

News May 17, 2024

ఆదిలాబాద్: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. నిర్మల్ వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అజీమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ అతనిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

News May 17, 2024

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం.. లేచిపోయిన ఇంటి పై కప్పు

image

ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. గుడిహత్నూర్‌ మండలంలో వడగళ్ల వర్షం పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఈదురుగాలులతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించి, విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చారు. ఇంద్రవెల్లి మండలంలో భారీ వృక్షాలు నెలకొరిగాయి. రోడ్డుపై చెట్టు విరిగి పడిపోవడంతో గంట సేపు రాకపోకలు స్తంభించాయి.

News May 17, 2024

ADB: ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యాసంవత్సరానికి గానూ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివి పదో తరగతిలో 7 జీపీఏకు పైగా సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 17, 2024

ADB: సీఎం కలిసిన సోషల్ మీడియా కో ఆర్డీనేటర్స్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌కి చెందిన సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు హైదరాబాద్‌లో గురువారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు చేసిన కృషిని ఆయన అభినందించారు.