India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద రోడ్డు క్రాస్ అవుతున్న ద్విచక్ర వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు కాగా అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న మావల పోలీస్ స్టేషన్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
అప్పుల బాధ, కల్లుకు బానిసై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామానికి చెందిన బన్న మల్లేష్ (49) కల్వరి చర్చి వెనకాల రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె. సురేష్ గౌడ్ తెలిపారు. అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
కడప జిల్లాకు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. గత కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంపై పార్టీలు దృష్టి సారించాయి. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో గెలిచిన ఆదిలాబాద్ ఎంపీ బాపురావు 3,77,374 ఓట్లను సాధించాడు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4,43,13 ఓట్లు దక్కాయి. దీంతో ఈ సారి కూడా గెలుపు తమదేనంటూ బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.
ADB లోక్‌సభ స్థానాన్ని 2019లో BJP గెలుచుకుంది. ఈ పార్టీకి 35.92 శాతం ఓట్లు వచ్చాయి. BRSకు 30.34, కాంగ్రెస్‌కు 29.91 ఓట్లు లభించాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు35.62 ఓట్లు వస్తే, BJPకి 34.32, కాంగ్రెస్‌కి కేవలం 19.26 శాతం ఓట్లు దక్కాయి. ఏడు సెగ్మెంట్లలో 4 బీజేపీ, రెండు బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ప్రస్తుతం ADBలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అక్రమ వడ్డీ వ్యాపారం, చిట్టీలు, ఫైనాన్స్ నిర్వాహకులపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. ఈ దాడులలో ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నడుపుతున్న స్థానిక విద్యానగర్‌కు చెందిన నస్పూరి వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేసి అతను వద్ద నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
ఆదిలాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ సోమవారం పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు కాగజ్‌నగర్‌లోని పటేల్ గార్డెన్‌లో నిర్వహించే బూత్ స్థాయి సమావేశంలో పాల్గొని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్‌లో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
జన్నారం మండలంలోని బాదంపల్లి గోదావరి తీరంలో మోటార్ రిపేర్ చేస్తుండగా ఓ యువకుడు మృతి చెందాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ గోదావరి తీరంలో మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాజేశ్ మండలంలో వైండింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి గ్రామ శివారులో ఆదివారం కుక్కల దాడిలో జింక దుప్పి మృతి చెందింది. గమనించిన వాహనదారులు గ్రామస్థులకు తెలియజేశారు. అనంతరం గ్రామ ప్రజలు జింక మృతదేహాన్ని పరిశీలించి అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్ లో సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.