Adilabad

News April 12, 2024

గాదిగూడలో రూ.4.50 లక్షల గంజాయి పట్టివేత

image

గాదిగూడ మండల పరిధిలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఉమ్మడి నార్నూర్ మండలంలో గత నాలుగు రోజుల్లో దాదాపు 18 కిలోలతో కూడిన సుమారు రూ.4.50 లక్షల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

News April 12, 2024

ట్రాక్టర్‌పై నుంచి పడి డ్రైవ‌ర్‌ మృతి

image

ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ పై నుంచి పడి డ్రైవ‌ర్‌ మృతి చెందిన ఘటన కుంటాల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దాన్ల రాజు (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తిరిగి ఓల గ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయాడు. ముఖంపై, తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 12, 2024

రామకృష్ణాపూర్: తండ్రిని చంపిన తనయుడి అరెస్టు

image

రామకృష్ణాపూర్ పట్టణం అల్లూరి సీతారాం నగర్‌కు చెందిన భామండ్లపల్లి రాయమల్లు(56)ని హత్య చేసిన రాకేష్ అనే నేరస్థుడిని అరెస్టు చేసినట్లు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. రాయమల్లు మద్యానికి బానిసై ఎప్పుడు ఇంట్లో వాళ్లతో గొడవ పడుతుండేవాడు. మృతుడి ఫోన్ కొడుకు రాకేష్ వాడుతున్నాడు. సెల్ ఫోన్ విషయంలో తండ్రి, కొడుకు గొడవపడి కొడుకు తండ్రిని రోకలి బండతో తలపై కొట్టగా మృతి చెందాడు.

News April 12, 2024

ఆదిలాబాద్: మురికి కాల్వలో పడి ఒకరి మృతి

image

ఆదిలాబాద్ పట్టణంలో ఓ మురికి కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవన సమీపంలోని శుక్రవారం మురికి కాల్వలో పడి చౌహన్ సంతోష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతను రోడ్లపై దొరికే సామగ్రిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే మురికికాలువలో ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇంకా ఏమైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

News April 12, 2024

కాసిపేట: పాము కాటుతో వృద్దుడు మృతి

image

కాసిపేట మండలంలోని ముత్యంపల్లికి చెందిన చొప్పరి బాలయ్య అనే వృద్దుడు పాము కాటుతో మృతి చెందాడు. మృతుడు దుబ్బగూడెం సమీపంలో మామిడి తోటకు కాపలాగా ఉంటున్నాడు. గురువారం అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలయ్యను చూసిన కొందరు కుటుంబీకులకు సమాచారం అందించగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News April 12, 2024

కాసిపేట: పాము కాటుతో వృద్దుడు మృతి

image

కాసిపేట మండలంలోని ముత్యంపల్లికి చెందిన చొప్పరి బాలయ్య అనే వృద్దుడు పాము కాటుతో మృతి చెందాడు. మృతుడు దుబ్బగూడెం సమీపంలో మామిడి తోటకు కాపలాగా ఉంటున్నాడు. గురువారం అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలయ్యను చూసిన కొందరు కుటుంబీకులకు సమాచారం అందించగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News April 12, 2024

RKP: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామక్రిష్ణాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజునగర్‌లో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో గురువారం రాత్రి కన్నతండ్రిని కుమారుడు హతమార్చాడు. సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన బామండ్లపల్లి రాయమల్లును కుమారుడు రాకేష్ రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 12, 2024

MNCL: సెల్‌ఫోన్ రిపేర్ చేయించలేదని యువతి సూసైడ్

image

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన సాయిష్మ అనే యువతి సెల్‌ఫోన్ రిపేర్ చేయించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజుల కిందట సెల్‌ఫోన్ డిస్ ప్లే పగిలిపోవడంతో బాగు చేయించాలని తల్లిదండ్రులను కోరింది. ఈ విషయంలో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండగా గురువారం ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిష్మ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఏఎస్సై నాగరాజు తెలిపారు.

News April 12, 2024

ఆదిలాబాద్ అబ్బాయిల మనసు దోచేస్తున్న విదేశీ అమ్మాయిలు

image

వేర్వేరు దేశాలకు చెందిన యువతీ, యువకులు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. విదేశీ అమ్మాయిలు ఏకంగా భారత యువకుల మనసులను దోచేస్తున్నారు. గుడిహత్నూర్ మండలం చింతగూడకు చెందిన రవికుమార్..మయన్మార్‌కు చెందిన జిన్ నెహూ థియేన్ అమ్మాయిని వివాహమాడారు. పాత బెల్లంపల్లికి చెందిన రాజు, లండన్‌కు చెందిన డయానాని పెళ్లి చేసుకున్నారు. ADBకు చెందిన అభినయ్ రెడ్డి.. అమెరికాకి చెందిన టేలర్ డయానె ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

News April 11, 2024

ADB: యువకుల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో యువకులు కొందరు డబ్బుల లావాదేవీల విషయమై గురువారం ఘర్షణ పడ్డారు. అనంతరం కోలిపుర కాలనీకి చెందిన ముజాహిద్, షాహిద్‌లపై కత్తులతో దాడిచేశారు. గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న DSP ఎల్.జీవన్ రెడ్డి, సీఐ సత్యనారాయణ అశోక్ రిమ్స్‌కు వెళ్లి వివరాలు సేకరించారు.