Adilabad

News June 29, 2024

ఉట్నూర్: అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం

image

ప్రధానమంత్రి జన జాతీయ న్యాయ మహా అభియాన్ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్లను 15 రోజుల్లో కచ్చితంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల మండల తహసిల్దార్లను ఆదేశించారు. ఐటీడీఏ కోర్ట్ కేసులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.

News June 28, 2024

ఆదిలాబాద్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తానూర్ మండలం కోలూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవక్వాడ్ అశోక్ (31) మద్యానికి బానిసై జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన పంట చేనులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 28, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు బలమైన గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిసినట్లు పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

News June 28, 2024

ఆదిలాబాద్: చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఇటీవల తాంసీ, బేల పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళల మెడలో నుంచి చైన్లు దొంగతనం చేశారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన అవినాష్, విభాష్, బజార్హత్నూర్‌కు చెందిన జాదవ్ ప్రదీప్ ముగ్గురితోపాటు ఒక బాల నేరస్థుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బంగారం స్వాధీనం చేశారు.

News June 28, 2024

ఆదిలాబాద్: బాలుడిపై లైంగిక దాడి.. 20ఏళ్ల జైలు శిక్ష

image

బాలుడిపై లైంగిక దాడి కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది.
2021 జూన్‌ 2న బాధిత బాలుడి బంధువు అయిన నేరడిగొండకు చెందిన మహేశ్‌(30) బాలుడిని కిరాణా దుకాణానికి తీసుకెళ్లే వంకతో తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతుండగా.. బాలుడి అక్క తమ్ముడిని వెతుకుతూ వెళ్లగా పరారయ్యాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.

News June 28, 2024

పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

image

నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీపై గురువారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేపర్ లీక్‌లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

News June 27, 2024

ఆదిలాబాద్: చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్

image

ఇటీవల తాంసీ, బేల మండలాల్లో పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ ఘటనలు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి అభరణాలతో పాటు ఒక బైకు నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News June 27, 2024

నిర్మల్: గుర్తుతెలియని శవం లభ్యం

image

బాసర-నిజామాబాద్ రైల్వే మార్గంలో ముఠాపూర్ గ్రామ శివారులో రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని వ్యక్తి(55) మృతదేహం రైల్వే పోలీసులు గుర్తించారు. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తి శవం కుళ్లిపోయినట్లు, ఒంటిమీద తెలుపురంగు చొక్కా, దోతి ధరించినట్లు వెల్లడించారు.

News June 27, 2024

ADB: ఆశల పల్లకిలో MLAలు.. మంత్రి పదవి ఎవరికో..?

image

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఊరిస్తోంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతోందనే ప్రచారం నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడత కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిని పదవి వరిస్తుందోననే ఆత్రుత నెలకొంది.

News June 27, 2024

ADB: ఉదయాన్నే 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటన ఈరోజు ఉదయం జరిగింది. వివరాలకు వెళ్తే.. మావల జాతీయ రహదారిపై నుంచి ఎండి అర్ఫత్, ఉస్మాన్ ప్రయాణిస్తున్న కారు ఆదిలాబాద్‌కు వస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది దీపక్, వసీం ఘటనా స్థలానికి చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక రిమ్స్‌లో తరలించారు.