Adilabad

News May 1, 2024

నిర్మల్: బట్టలను ఇస్త్రీ చేసి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

image

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలం లక్కారాం గ్రామంలో గడప గడపకు మండల నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ లాండ్రి షాప్‌లో ఎమ్మెల్యే బట్టలను ఇస్త్రీ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

News May 1, 2024

ఖానాపూర్: తాటి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

తాటి చెట్టుపై నుంచి పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి గ్రామంలో జరిగింది. బాదంకుర్తి గ్రామానికి చెందిన కంటి శంకర్ బుధవారం ఉదయం తాటి ముంజలు తెంపడానికి తాటి చెట్టు ఎక్కాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాటి ముంజలు కోసే క్రమంలో తాటి చెట్టు పైనుండి పడి శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కంటి శంకర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. ఆయన మృతితో విషాదం నెలకొంది.

News May 1, 2024

MNCL: వేసవి ప్రత్యేక రైలు ప్రారంభం

image

రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు వేసవి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మే 4, 7, 11, 14, 18, 24, 25, 28వ తేదీల్లో బిలాస్పూర్ నుంచి యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ నుంచి బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను మే 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30వ తేదీల్లో సమ్మర్ స్పెషల్ ట్రైన్‌గా నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News May 1, 2024

కడెం: తునికాకు సేకరణకు వెళ్లి.. శవమై కనిపించి

image

తునికాకు సేకరణకు వెళ్లి వృద్ధుడు మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని అటవీ ప్రాంతానికి దస్తురాబాద్ మండలం దేవునిగూడకు చెందిన మోకిరాల బక్కన్న ఆదివారం తోటి వారితో తునికాకు సేకరణకు వెళ్లాడు. భోజన సమయంలో తోటి వారిని తినమని చెప్పి సేకరణకు వెళ్లగా ఎంత వెతికినా దొరకలేదు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు.

News May 1, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌కు అగ్రనేతలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున మే 2న ఆసిఫాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మే 5న రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. మే4 న KCR మంచిర్యాలలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు. బీజేపీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌తో సభలను నిర్వహించాలని భావిస్తోంది.

News May 1, 2024

ఆసిఫాబాద్: CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన SP

image

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్‌లో ఏర్పాటు చేసి సభ స్థలాన్ని, హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు, సభ స్థాయికి వచ్చి వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు. అనంతరం భద్రతాపరంగా తీసుకోవలసిన చర్యల గురించి, బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News April 30, 2024

రూ.37 లక్షల విలువైన గంజాయి కాల్చివేత: ADB ఎస్పీ

image

ADB జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లలో నమోదైన 19 కేసుల్లో నిందితుల వద్ద సీజ్ చేసిన 150 కిలోల గంజాయిను మంగళవారం తలమడుగు మండలం సుంకిడి అటవీ ప్రాంతంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. నిషేధిత గంజాయి విలువ సుమారుగా రూ.37లక్షలు ఉంటుందని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.

News April 30, 2024

కాగజ్‌నగర్‌లో 60 లీటర్ల నాటుసారా స్వాధీనం

image

ఆసిఫాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో దహేగాం, కౌటాల, చింతలమానేపల్లి మండలంలోని లంబాడీహెట్టి, గుప్పగూడెం, కల్వాడ, రణవెల్లి, మర్రిగూడెం గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 4వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు.

News April 30, 2024

ఇంద్రవెల్లి: ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు

image

పురుగు మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం జైత్రాం తండాకి చెందిన నూర్ సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. నూర్ సింగ్ మంగళవారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

News April 30, 2024

నిర్మల్: అందరి సహకారంతోనే ప్రథమ స్థానం: డీఈవో

image

అందరి సహకారంతోనే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్‌ను పూర్తి చేసి ప్రత్యేక స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని ఒకటి, రెండు మార్కులతో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు ఆందోళన చెందకుండా సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు.