India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 2న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసిఫాబాద్‌కు రానున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఆదివారం తెలిపారు. స్థానిక ప్రేమల గార్డెన్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరిస్తారని తెలిపారు.

తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న తండ్రిని చంపిన హత్య కేసులో నిందితుడైన కొడుకు సాయిలును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సోన్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. మాదాపూర్ గ్రామానికి చెందిన నడిపి ఎల్లయ్యకు శనివారం రాత్రి భార్య చిన్నక్క అన్నం పెట్టడం ఆలస్యం కావడంతో కర్రతో కొట్టాడు. తల్లిని చిత్రహింసలకు గురిచేయడాన్ని తట్టుకోలేక సాయిలు తండ్రిని కొట్టి చంపాడు.

వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన జన్నారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని వినాయక్ నగర్‌కు చెందిన మేడిశెట్టి మహేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం దేవాలయానికి వెళ్లే క్రమంలో వడదెబ్బ తగలడంతో మహేశ్ పోన్కల్ ప్రాంతంలో ఉన్న ఓ డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరొకరు ఆత్రం సుగుణ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ అయిదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివారు. తమ గ్రామానికే చెందిన ఎంపీ వెంకటేశ్‌నేతను స్ఫూర్తిగా తీసుకొని, భర్త ఆత్రం భుజంగరావు సహకారంతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు సుగుణ చెప్పారు.

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాజర్షిషాపై బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, ఆశిష్.. సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గోడంనగేశ్ ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు నమోదు చేయలేదని, ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఈవో దృష్టికి తెచ్చారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవలన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు అగ్ర నేతలతో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రానికి మే 5న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం రానున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 43, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 44.5 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నా వేళలో అవసరముంటే తప్ప బయటకు రావద్దని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వాంకిడి మండలంలో మంత్రి సీతక్కకు మరియు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఆత్రం సుగుణకు సాంస్కృతి సంప్రదాయాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజలు శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆడ బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సుగుణను మెజారిటీతో గెలిపించాలని కోరారు.

నార్నూర్ మండలంలోని చొర్గావ్ గ్రామానికి చెందిన మలక్ సింగ్(38) పురుగు మందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ రవికిరణ్ తెలిపారు. మలక్ సింగ్ ఈ నెల 20న మద్యం తాగి ఇంట్లో తల్లిదండ్రులు, భార్యతో గొడవ పడ్డాడు. కుటుంబీకులు మందలించడంతో అతడు పురుగులమందు తాగాడు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.

ఈ నెల 25 నుంచి మే 8 వరకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. ఫిర్యాదుల కొరకు మానిటీరింగ్ సెల్ ఇన్‌ఛార్జ్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఓటరు స్లిప్‌ల పంపిణీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నం:7670858440, బోథ్ సెగ్మెంట్ నం:9440995663, జిల్లాస్థాయి ఫిర్యాదు కోసం నం:1950, 18004251939 లను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.