India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసు డ్రెస్ వేసుకొని ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలోని HP పెట్రోల్ బంకులో ఆదివారం రాత్రి కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగతనం చేసి అనంతరం లక్కీ దాబాలో దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 20. 175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8. 80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 148 మీటర్లకు గాను 142. 90 మీటర్లుగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే యాసంగి సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ చదువుతున్న రెగ్యులర్, బ్యాక్ లాక్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం తెలిపారు. సెమిస్టర్-2, 4, 6 విద్యార్థులు ఈ ఫీజును చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
పెళ్లి సంబంధం కుదరడం లేదని, తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. S Iమహేందర్ వివరాల ప్రకారం.. మంచిర్యాల రాజీవ్ నగర్ కు చెందిన గ్రీష్మాసాయి (25) హైదరాబాదులో PG చదువుతోంది. గ్రీష్మాకు నాలుగేళ్లుగా వారి కులదైవం పేరుతో పూనకం వస్తుంది. ఈ కారణంగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఈ క్రమంలో సెలవులపై గ్రీష్మ ఇంటికి వచ్చింది. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది.
కాంగ్రెస్ పార్టీలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. రోజుకో పేరును తెరపైకి తీసుకువస్తున్న అధిష్ఠానం ఎవరి పేరునూ ఖరారు చేయకపోవడంతో నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అభ్యర్థి ఎంపిక ప్రహసనంగా మారడంతో పార్టీల చర్చకు దారి తీసింది. తమ ప్రాంతాల్లో తామే అభ్యర్థినంటూ కొందరు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయలైన ఘటన లొకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అభిషేక్, జితెందర్ భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. బైక్ పై ఆదివారం నిజామాబాద్ వెళ్తుండగా పంచగుడి గోదావరి వంతెనపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా జితెందర్‌కు తీవ్రగాయాలనైనట్లు పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళి లో భాగంగా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేని రెండు లక్షల నగదును ఆదివారం అధికారులు సీజ్ చేశారు. మహారాష్ట్ర కు చెందిన ఓ కారును ఎన్నికల సిబ్బంది తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో రూరల్ సీఐ ఫణిందర్, తలమడుగు ఎస్ఐ ధనశ్రీ, ఎస్ఎస్‌టీ సభ్యులు తదితరులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా నాయకులు BRSను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ మాజీ మండల అధ్యక్షులు ఆయిండ్ల పోశెట్టి, మంజులాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి మంత్రి ఆహ్వానించారు.
MNCL జిల్లా కాసిపేటలో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు యత్నించింది. కాసిపేటకి చెందిన యువతి ASF జిల్లాలోని ఓ మండలంలో వైద్యురాలిగా పనిచేసేది. అదే మండలంలో విధులు నిర్వర్తించే ఓ వైద్యాధికారితో ఆమెకు పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారింది. ఈక్రమంలో అతను మరోకరితో ప్రేమాయణం నడిపారు. విషయం ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. మానసిక వేదనకు గురైన వైద్యురాలు విషం తాగగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
పంట దిగుబడులు రాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహాత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ రాజారాం (56) 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. రబీలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల దిగుబడి రాక మనస్తాపానికి గురైన రాజారాం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.