India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోడం నగేశ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బాల్కసుమన్‌తో విభేదాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి BRS టికెట్టు రాకపోవటంతో ఆయన BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు రాలేదని పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడటం చెన్నూర్‌కి తీరని లోటని స్థానికులు భావిస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ..BRS నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండటంతో ఆ ప్రభావం నిర్మల్ జిల్లాలో కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో కాంగ్రెస్, BJP బలంగా ఉండటంతో ఈ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి, BRS కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు BRSను వీడనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 2వ విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా డా.సుమలత పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఫోన్ రాగా ఆమె హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మొదట బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. బీజేపీ గోడం నగేశ్‌కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్‌లో చేరారు.

కాగజ్‌నగర్ మండలం భట్టుపెల్లికి చెందిన రమేశ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను మే8, 2023న అత్యచారం చేశాడు. కుటుంబీకులు అదేరోజు కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. మంగళవారం 14 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన మత్స్యకారుడు రాజన్న(46) మంగళవారం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో మునిగాడు. గమనించిన జాలరులు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఒకరిపై కత్తితో దాడిచేసి కేసులో ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోలిపూరకు చెందిన మునీర్ బేగ్‌పై సోమవారం రాత్రి 11 గంటలకు కేఆర్కే కాలనీకి చెందిన షేక్ షాబాద్, సయ్యద్ రెహాన్ హష్మీ కత్తితో దాడితో చేశారు. బాధితుడి తల్లి గులాబ్ బీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. SHARE IT

జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉంటూ సజావుగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతి ఒక్కరు కృతనిశ్చయంతో అప్రమత్తతో విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.

సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్ ఓపెనింగ్ లో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల వివరాలను తెలియజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.