Adilabad

News April 19, 2024

MNCL: ‘ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరగనున్న ఓపెన్ ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేవం నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు 5, 10వ తరగతికి 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా చర్యలు చేపట్టమన్నారు.

News April 18, 2024

ADB: తోలి రోజు 2 నామినేషన్‌లు దాఖలు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఏడీఆర్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు శ్యామ్ లాల్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్‌కు చెందిన రాథోడ్ సుభాష్ పాలనాధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

News April 18, 2024

మందమర్రిలో ఈ నెల 21న పుట్ బాల్ జట్టు ఎంపిక

image

మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఈ నెల 21న మధ్యాహ్నం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బాలుర సీనియర్స్ పుట్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్ల పుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ రెడ్డి తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, 3 ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని సూచించారు.

News April 18, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో పెరుగిన రాబందుల సంఖ్య

image

ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతుల్లో రాంబందులూ ఉన్నాయి. అయితే ASF జిల్లాలోని పాలరాపుగుట్టపై అరుదైన లాంగ్ బిల్డ్ వల్చర్ జాతి రాబందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగేళ్లలో వాటి సంఖ్య 10-33 వరకు పెరిగినట్లు గుర్తించారు. బయాలజిస్ట్‌ రవికాంత్‌ ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ అధికారులు వాటి పర్యవేక్షణ చేపట్టారు. గుట్టపై జటాయువు పేరుతో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు.

News April 18, 2024

చాందా గ్రామం స్ఫూర్తితోనే సివిల్స్‌లో ర్యాంక్

image

యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 718వ ర్యాంకుతో ఆదిలాబాద్‌కు చెందిన విశాల్ సత్తా చాటాడు. జైపూర్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఆరె వెంకటేశ్వర్-అనవాల దంపతుల కుమారుడు విశాల్ తనదైన ప్రతిభ కనబరిచాడు. కాగా వీరిది సొంతూరు ADB రూరల్ మండలం చాందా గ్రామం. ఈ గ్రామంలో 3వేల మందిలో 500 మంది ప్రభుత్వ ఉద్యోగులే. అయితే చాందా గ్రామం స్ఫూర్తితోనే సివిల్స్ సాధించాడని విశాల్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.

News April 18, 2024

ADB: ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ ప్రణీత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై ఆయా శాఖల వారి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉదయం పూట ఇంటర్, మధ్యాహ్నం పదో తరగతి పరీక్షలు ఉంటాయని ఇంటర్ పరీక్షలకు 463 మంది, పదో తరగతి పరీక్షలకు 792 మంది హాజరవుతారని పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 18, 2024

MNCL: ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బస్టాండ్‌లోని ఆసిఫాబాద్‌కు వెళ్లే ప్లాట్ ఫామ్ వద్ద మరణించిన మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

News April 18, 2024

MNCL: ‘ప్లీజ్ మా అమ్మని కాపాడండి’

image

కాసిపేట మండలం కోమటిచేనుకి చెందిన <<13074826>>మౌనిక విద్యుత్ షాక్‌తో<<>> మృతి చెందింది. కాగా విద్యుదాఘాతానికి రేకులపై పడిపోయిన తల్లిని ఆమె నాలుగేళ్ల కుమారుడు గౌతమ్ చూశాడు. వెంటనే పెద్దనాన్నకు సమాచారం అందించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి మౌనికకు కిందికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని 108 సిబ్బంది తెలిపారు. తన తల్లిని కాపాడాలని 108 సిబ్బందిని వేడుకుంటున్న గౌతమ్‌ని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు.

News April 18, 2024

కాసిపేట: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..!

image

కాసిపేట మండలంలోని కోమటిచేనుకు చెందిన బెడ్డల మౌనిక అనే మహిళ బుధవారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. వాటర్ ట్యాంకులో నీటిని పరిశీలించేందుకు ఇంటిపైకి ఎక్కగా తెగిపోయిన విద్యుత్ వైరు ఇనుప రేకులకు తాకింది. మౌనిక వాటిని తాకడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2024

ఆదిలాబాద్: నేటి నుంచే షురూ

image

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ADB పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్‌ మొదటిస్థానంలో ఉంటే 2,10,915 ఓటర్లతో బోథ్‌ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ADB కలెక్టరేట్‌ ఆవరణలో నేటి నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది.