India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 2న వీధి కుక్కల దాడిలో గాయపడిన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. పెంబి మండలం తాటిగూడకు చెందిన భూక్య సరిత-అమర్సేంగ్ దంపతుల కూతురు శాన్విత ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆమెకు నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్ళీ గురువారం జ్వరం రావడంతో నిర్మల్లోని ఆసుపత్రికి తరలించి అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో చిన్నారి మృతి చెందింది.

వేసవి వేళ భూరగ్భజలాలు అడుగంటి ఆదిలాబాద్‌లో నీటి ఎద్దడి మొదలైంది. జిల్లాలో మొత్తం 972 కొత్త తాగు నీటి పథకాలు, పాత పథకాలు 557, చేతిపంపులు 3,461, మోటార్లు 220 ఉన్నాయి. అయినా ఇంద్రవెల్లి, నార్నూర్ తదితర ఏజెన్సీ మండలాల్లో చేతిపంపు నుంచి నీళ్లు రావడం గగనంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఈ సమయంలో మిషన్ భగీరథ SE సురేశ్ శుభవార్త చెప్పారు. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామానికి నీరు అందిస్తామన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్య నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమైన పత్రికలు, పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్‌తో కలిసి సందర్శించి సౌకర్యాలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకులలో విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని అనారోగ్యానికి గురైనా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సవేల గ్రామానికి చెందిన డాక్టర్ రాజ్‌కుమార్ కడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. గత రాత్రి భుక్తాపూర్ వద్ద ఆయన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో డాక్టర్ రాజకుమార్ మృతిచెందారని కడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుకు జాతీయస్థాయిలో నామినేటెడ్ పోస్ట్ బీజేపీ హైకమాండ్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును బాబురావుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నగేశ్‌ను ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో సోయం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

పెద్దపల్లి MP అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ పేరును ఖరారు చేసింది. 2010లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మేనేజ్‌మెంట్ డిగ్రీ USAలో పూర్తి చేశాడు. 2011లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో శిక్షణ తీసుకుని, 2012లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. వీ6 ఛానల్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న నాగరాజును సర్వీసు నుంచి తొలగించినట్లు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్‌గా విధుల్లో చేరిన నాగరాజు నకిలీ పీజీ సర్టిఫికెట్ సమర్పించినట్లుగా నిర్ధారించి విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ లోని తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్ గూడకు గ్రామ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి చేతి పంపు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోరు వేసినప్పటి నుంచి అక్కడ నీరు ఉబికి వస్తోంది. అన్ని కాలాల్లో 24 గంటలు నీరు ఉంటుందని, భూమిలో నీటి ఊట ఎక్కువగా ఉన్నచోట ఇలా జరుగుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ బోరింగ్ వల్లనే ఆ ఊరికి బోరింగ్ గూడ అని పేరు వచ్చిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ADB MP స్థానం ఆత్రం సుగుణకు కేటాయించే అవకాశాలున్నాయి. ఆమె అభ్యుదయ భావాలతో పలు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ ఆత్రం సుగుణ కీలక పాత్ర పోషించారు. 1995లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జన్నారం మండలం మురిమడుగు నుంచి గెలిచారు. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ.. ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.