India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉంటూ సజావుగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతి ఒక్కరు కృతనిశ్చయంతో అప్రమత్తతో విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.

సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్ ఓపెనింగ్ లో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. మీడియా సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల వివరాలను తెలియజేస్తామన్నారు.

ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో నేడు నిర్మల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు.. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్ హెచ్చరిక చేశారు. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
SHARE IT..

ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్, గుడిహత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్ హత్నూర్, తలమడుగు మండలాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల గాలులతో కూడిన వాన కురియడంతో పంటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. బజార్ హత్నూర్ 29.5 మీమీ వర్షపాతం నమోదు కాగా.. తలమడుగులో 20.8 మీ.మీ. గుడి హత్నూర్ లో 19.3మీమీ, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ దరి లో 18.3 మీమీగా వర్షపాతం నమోదైంది.

పార్లమెంట్ ఎన్నికలు సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా ఎస్పీ గౌస్ ఆలం తో కలసి పాల్గొన్నారు. పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారులకు క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల పక్రియను ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని అన్నారు.

పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులపై తరగతి గది పైకప్పు ఊడిపడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జైనథ్ మండలం గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గది పైకప్పు ఉడిపడింది. దీంతో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్ధిని అక్షయ, ఉపాధ్యాయుడు పురుషోత్తమ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థినిని వెంటనే స్థానిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్ ,ఇంప్రూవ్మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్ నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాధిక తెలిపారు. ఈనెల 21, 23, 26, 28, 30, ఏప్రిల్ 1న పరీక్షలు ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో మెుత్తం నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశరెడ్డి (55) అనే రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా పొలానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పంట దిగుబడి రాక.. బ్యాంకు అప్పులు పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.

చావు గురించి తప్పుడు సమాచారం ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. బోథ్‌కు చెందిన నరసింహదాస్, బాపు ఇద్దరు అన్నదమ్ములు. అనారోగ్యంతో బాధపడుతున్న బాపు బతికే ఉన్నా, ఆయన చనిపోయాడంటూ బంధువులు ఫోన్ చేసి చెప్పడంతో తమ్ముడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అన్న ఇక లేడని రోదించిన దాస్ గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నింపింది.
Sorry, no posts matched your criteria.