Adilabad

News March 17, 2026

ADB: రూ.3.38 లక్షల పశువులకు ఉచిత టీకాలు: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పశువుల సంరక్షణ కోసం నెల రోజుల పాటు సాగే ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 2 లక్షల 90 వేల ఆవులు, 48 వేల గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యాధితో పాడి రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తోందని, రైతులందరూ వాడుకోవాలని కోరారు. పల్లెల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News March 17, 2026

ADB: రెండు, మూడు రోజుల్లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ DM ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి, తేమ శాతం 14% మించకుండా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన తేదీల్లోనే పంటను తేవాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 17, 2026

ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 17, 2026

ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 17, 2026

ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రహదారి భద్రతపై పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా నియమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.

News March 16, 2026

ADB: బహిరంగంగా మద్యం తాగుతున్నారా? అయితే జైలుకే!

image

ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని పట్టుకునేందుకు ప్రతిరోజు 20 ప్రత్యేక పోలీస్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పక్కన మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించేది లేదని, నేరుగా FIR నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని కోరారు.

News March 15, 2026

ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

image

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్‌ వాపోయారు.

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.

News March 14, 2026

థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 14, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్ రాజర్షిషా

image

ఆదిలాబాద్ జిల్లాలో గృహ అవసరాలతో పాటు విద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్.పీ.జీ. సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, చమురు కంపెనీల సేల్స్ అధికారులు, అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.