India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాంసి ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఎటువంటి అనుమతి లేకుండా గైర్హాజరు అవుతున్నట్లు ఆమె గుర్తించారు. పరీక్షల సమయంలో వార్డెన్ గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన ఆమె వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. అదేవిధంగా విధులకు గైర్హాజరు అవుతున్న బోధనేతర సిబ్బంది విజయ్, మహేందర్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా BJP ST మోర్చా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను రాష్ట్ర BJP ST మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ BJP ST ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌గా జెడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, పెద్దపల్లి పార్లమెంట్ ST మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ఆసిఫాబాద్ MLA అభ్యర్థి ఆత్మారాం నాయక్‌ని నియమించారు.

మంచిర్యాలలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ATMలో ఆదివారం రాత్రి చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ATMను పగులగొట్టి చోరీకి యత్నిస్తున్న శబ్దాలు విని అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు వచ్చి వివరాలు అడగగా బ్యాగ్ అక్కడే వదిలి పారిపోయినట్లు CI బన్సీలాల్ తెలిపారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవం మిశ్రాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

ఇటీవల ఓ మగశిశువును ముళ్లపొదల్లో పడేసిన ఘటన భీంపూర్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఆ మగబిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలికగా గుర్తించారు. సదరు బాలిక గర్భం దాల్చడానికి కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. వరుసకు బావనే గర్భం దాల్చడానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

పెళ్లి కావడం లేదనే మనోవ్యధతో ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన కొత్తూరు సుమలత ఆదివారం కన్నాల రైల్వేగేట్ వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లీడు దాటి పోతున్నా వివాహం కావడం లేదనే బాధతో ఆత్మహత్య చేసుకుందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఎస్టీ-1 కాగా.. మూడు జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, మథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ ఉండగా.. ఇందులో 16,44,715 మంది ఓటర్లు ఉన్న ట్లు ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. పురుషులు 8,02,575.. మహిళలు, 8,42,054, ఇతరులు 86, 2,085 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా 2,111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదిలాబాద్‌కు చెందిన రాజు (30), సాగర్ ఓ వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం అక్కడే ఉన్న వినోద్, ప్రవీణ్‌లతో వారు గొడవపడ్డారు. దీంతో వినోద్, ప్రవీణ్ లు వారిని వెంబడించి టీటీడీ సమీపంలో దాడి చేశారు. ఈ దాడిలో రాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, సాగర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

ప్రియురాలితో గొడవ పడిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుంటాలలో
జరిగింది. ఏఎస్సై దేవ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండం శ్రీకాంత్ (20) అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాదిగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరూ గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుందని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కాగజ్ నగర్ మండలం రాంనగర్ గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చేందుకు యావత్ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించనున్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.