India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నవరాత్రి ఉత్సవాల్లో మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రాత్రి సమయాల్లో యువత అనవసరంగా తిరగడం మానేయాలని సూచించారు. మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో యువత, తెలియని వారు వారిని వీడియోలు తీయడం, వికృత చేష్టలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ చేయాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, నిమజ్జనం చేసే చెరువుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.

దుర్గా నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనంలో డీజేలకు అనుమతులు లేవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
సుప్రీంకోర్టు నియమ నిబంధనలను లోబడి సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో శారదా దేవి మండప కమిటీల వద్ద మహిళా సిబ్బంది, షీ టీం బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్ ఉంటుందన్నారు.

ఉట్నూర్ మండలంలోని గంగాన్నపేట్‌కు చెందిన కీర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి 729వ ర్యాంక్ సాధించింది. ఒడిశాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఐదేళ్ల బీఎస్ఎంఎస్ కోర్సులో సీటు సంపాదించింది. ప్రతిభ కనబరిచిన కీర్తిని పలువురు అభినందించారు.

మహిళలు ఇష్టంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. వారి కోసం తెలంగాణ సర్కారు ఏటా పండుగకు చీరలు అందజేసేది. ప్రభుత్వం మారడంతో గతేడాది ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. ఈసారి ఇద్దామనుకున్నా కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకే ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి ADBలో 9,50,000 వరకు మహిళా ఓటర్లున్నారు. కానీ 40వేల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 4,50,000 మందికే చీరలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

భారీ కుంభ కోణాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్లాటును తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముగ్గురిపై కేసు చేసి అరెస్టు చేసినట్లు మావల సీఐ స్వామి తెలిపారు. విజయ్ 2011లో ఎంప్లాయీస్ కాలనీలో ప్లాటును కోనుగోలు చేశారన్నారు. ఆ ప్లాటు పెంయిటర్ సంజీవ్ సహాకారంతో వెంకటరమణ గత ఏడాది అప్పటి సబ్ రిజిస్ట్రార్‌తో రఘుపతి పేరిట మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. బాధితుడు ఫిర్యాదుతో దర్యాప్తు చేశామన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం స్కిన్ చికెన్ కిలో రూ.199 నుంచి రూ.215 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.226 నుంచి రూ.246 వరకు పలికింది. గత వారంతో పోలిస్తే రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగింది. ఈ ఆకస్మిక పెరుగుదలతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఆసుపత్రుల్లో రోగుల భద్రతపై ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో శనివారం నిర్వహించిన జాతీయస్థాయి అవగాహన సదస్సులో ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ నోడల్ అధికారిగా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 30 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్సలు అందించేటప్పుడు రోగులకు ఎలాంటి మందులు అందించాలి, నిర్వహణ తీరు, మందుల ప్రభావం తదితర అంశాల్లో అవగాహన కల్పించినట్లు ఆయన వెల్లడించారు.

ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్ ఎస్పీగా పదోన్నతి రాగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన కాజల్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.