Adilabad

News January 6, 2026

విద్యారంగ అభివృద్ధికి చర్యలు: ADB కలెక్టర్

image

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లోని ఎస్సీ వసతి గృహంలో వాటర్ ప్లాంట్, గ్రీసర్‌లను ప్రారంభించి బ్లాంకెట్‌లను పంపిణీ చేశారు. చదువుపై శ్రద్ధ వహించి, పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

News January 5, 2026

ఆదిలాబాద్: డీసీసీబీని సందర్శించిన కలెక్టర్

image

ఆదిలాబాద్‌లోని డీసీసీబీని కలెక్టర్‌, డీసీసీబీ ప్రత్యేక అధికారి రాజర్షిషా సోమవారం సందర్శించారు. బ్యాంకులో అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు, ఖాతాదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర పరిపాలన సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్యాంకు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచనలు చేశారు. జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, సీఈఓ సూర్యప్రకాష్ పాల్గొన్నారు.

News January 5, 2026

ఆదిలాబాద్: ఉపాధ్యాయులందరికీ ఓడీ సౌకర్యం కల్పించాలి: తపస్

image

జిల్లాలో టెట్ పరీక్షల నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఓడీ సౌకర్యం కల్పించాలని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్ చౌహాన్, వలబోజు గోపికృష్ణ కోరారు. సోమవారం అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జి DEO రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నూతన తపస్ కమిటీని పరిచయం చేశారు. వేసవికాలంలో వృత్యంతర శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులందరికీ ఐదు రోజులు సంపాదిత సెలవులు మంజూరు చేయాలన్నారు.

News January 5, 2026

ఆదిలాబాద్: బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

image

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 29 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా సమస్యలు తెలియజేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పందించి సంబంధిత పోలీసు అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉన్న 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా చెప్పాలన్నారు. సీసీ రాజు, సిబ్బంది కవిత, వామన్ పాల్గొన్నారు.

News January 5, 2026

వాహనదారుల భద్రతకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు: ADB SP

image

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు-2026లో భాగంగా ఆయన మాట్లాడారు. వాహనదారుల భద్రత కోసం నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.

News January 5, 2026

ఆదిలాబాద్: నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. సోమవారం నాగోబా దేవాలయాన్ని కలెక్టర్, పీవో యువరాజ్ మర్మాట్ సందర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

News January 5, 2026

ఆదిలాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(38) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం ఇచ్చోడలోని తన స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.

News January 5, 2026

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

image

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.