India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ వ్యక్తి కనపడకుండా పోయి శవమై తేలిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వన్ టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. ఖానాపూర్‌కు చెందిన సాయికుమార్ (28) ఈనెల 22 నుంచి కనపడడం లేదని సోదరుడు గణేశ్ 25న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఖానాపూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా గురువారం శవమై కనిపించాడు. కుడి కన్నుకు ఆపరేషన్ కాగా కన్ను నుంచి నీరు, చీము కారుతుందని అది భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.
ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNNS యాక్ట్ (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. 100-200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించడానికి చూసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా తిరగడం, పార్టీ జెండాలను పార్టీ గుర్తులను ధరించకూడదని హెచ్చరించారు.
జిల్లా సబ్ జూనియర్ మినీ క్రీడాకారులు రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణించాలని జిల్లా బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు ఫిరంగి అజయ్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాస్థాయి బేస్ బాల్ సబ్ జూనియర్ మినీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి గజ్వేల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాజశేఖర్, హరిచరణ్, గౌతమ్, రూపేష్, విజయ్ ఉన్నారు.
అకోలి గ్రామ డాక్టర్లు, వారి తల్లిదండ్రుల అభినందన సభ, వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కమ్మల నర్సింలు మాట్లాడారు. తమ గ్రామం 90% అక్షరాస్యత సాధించిందని, ఆ ప్రభావం 19మంది డాక్టర్లు, 34మంది ఉద్యోగులను ఇచ్చిందన్నారు. పీజీ చేసినవారు 23 మంది ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఉదారి నారాయణ పాల్గొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 39 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జరిగిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 11,418 మంది పురుషులు, 5,110 మంది మహిళలు, మొత్తం 16,528 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ★ఉదయం 8 నుండి 4 వరకు పోలింగ్.
నేడు జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ADB జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మెదక్ – నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ & టీచర్స్ ఎన్నికలను దృష్ట్యా ఆదిలాబాద్‌లో గురువారం పోలింగ్ కేంద్రాలున్న ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. కావున జిల్లా విద్యాశాఖాధికారి, ఆదిలాబాద్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులందరూ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ పథకాలను జిల్లాలో గెజిటెడ్ అధికారుల సహకారంతో సమర్థవంతంగా అమలు చేద్దామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ రూపొందించిన డైరీని కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. అంతకు ముందు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్, రామారావు, తదితరులు ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
Sorry, no posts matched your criteria.