Adilabad

News June 17, 2024

కాగజ్‌నగర్‌లో పులి సంచారం

image

కాగజ్‌నగర్ మండలంలో పులి సంచారం కలకలం రేపింది. మండల సమీపంలోని గోంది అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలతో కలిసి స్థావరం ఏర్పాటు చేసుకొని సమీప ప్రాంతాల్లో సంచరిస్తుందన్నారు. దీంతో సమీప మండలాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

News June 17, 2024

ADB: బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ బక్రీద్ అని ప్రజలంతా సంతోషంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజావాణి ఉండదని, ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కి రాకూడదని సూచించారు.

News June 16, 2024

MNCL: కవ్వాల్ టైగర్ జోన్‌కు పర్యాటకుల తాకిడి

image

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం ఐపీఎస్ అధికారి సుధీర్వెజి తన కుటుంబ సభ్యులతో కలిసి సఫారీలో అడవి ప్రాంతంలో పర్యటించారు. అడవిలో జంతువులు పక్షులను చూసి ఆయన సంబరపడ్డారు. టైగర్ జోన్ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్నందున పర్యాటకులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News June 16, 2024

జైపూర్: తాటి చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి

image

తాటి చెట్టుపై నుండి కింద పడి గాయపడిన జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొంగోని రమేష్ గౌడ్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. రమేష్ గౌడ్ ఈ నెల 9న తాటి చెట్టు ఎక్కుతుండగా మోకు జారి కింద పడడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

News June 16, 2024

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో పెరిగిన ప్రసూతి మరణాలు

image

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసూతి మరణాల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య తగ్గినా.. ఈ రెండు జిల్లాల్లో ప్రసూతి మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత రెండేళ్లలో మృతి చెందిన వారిలో 40 శాతం మంది 21 నుంచి 25 ఏళ్ల వయసు లోపువారే ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ నివేదిక ద్వారా తెలుస్తోంది. 71 శాతం మంది సిజేరియన్ ఆపరేషన్ల సమయంలో, సహజ ప్రసవాల్లో 29 శాతం మరణించినట్లు నివేదికలో వెల్లడైంది.

News June 16, 2024

నిర్మల్: రెండేళ్ల బాలుడికి కిడ్నీలో రాళ్లు

image

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధని గ్రామానికి చెందిన దివ్యరాణి,రాజ్ కుమార్ దంపతుల రెండేళ్ల కుమారుడు విహాన్ కొంతకాలంగా కిడ్నీలో నొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చూపించగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కిడ్నీలో రాళ్లు తొలిగించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.

News June 16, 2024

ఆదిలాబాద్: TUTF భవనంలో ఉచిత వెబ్ అప్షన్ ప్రక్రియ

image

ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. వెబ్ అప్షన్‌లు పెట్టుకునే అవకాశం శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు వరకు ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని TUTF సంఘ భవనంలో ఉచితంగా వెబ్ అప్షన్‌లు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఉపాద్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలందర్ తెలిపారు.

News June 15, 2024

ADB: ‘రైతుబందు కోసం ఎదురుచూపులు’

image

వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబందు పథకం కింద అందించే పెట్టుబడి సహాయం ఆలస్యం కావడంతో అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రారంభమై వారం రోజులు గడిచిన రైతుబందు జాడ లేదని రైతులు ఆరోపించారు. జిల్లాలో 1,63,359 మంది రైతులు ఉండగా జిల్లా వ్యాప్తంగా రూ.2,872,851,984 నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.

News June 15, 2024

ADB: సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య?

image

ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ జైనథ్ హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రేమించిన వాడి కోసం సొంత భార్య.. సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఫోన్లో సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడిన కాల్ డేటా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

News June 15, 2024

భీంపూర్: పాము కాటుతో మహిళ మృతి

image

భీంపూర్ మండలంలోని కైరి గూడ గ్రామానికి చెందిన మహిళ పెందూర్ లక్ష్మి(30) పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందింది. పెరట్లో పని చేస్తుండగా కాలిపై పాము కాటువేయగా.. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె కుటుంబీకులకు చెప్పారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు ఎస్సై ఖలీల్ తెలిపారు. భర్త ఇది వరకే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు