India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ADB జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.
రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31 వరకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయ విధులు నిర్వహించుకొని ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నమాజ్, రోజా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ కాలనీలో 13 ఏళ్ల మైనర్ బాలికపై శుక్రవారం అత్యాచారం చేయడంతో బాలిక తరఫు వారి ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రిమ్స్ వద్ద స్థానికులు పెద్దఎత్తున గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రిమ్స్‌కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్‌లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మావల ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక దస్నాపూర్‌కు చెందిన విజయ్ మేస్త్రీ పనిచేసేవాడు. అతనికి అప్పు ఉండడంతో మద్యానికి బానిసగా మారాడు. ఈనెల 18న హెయిర్ కలర్ తాగగా వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
బోథ్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో బాల్య వివాహ ముక్త్ భారత్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోక్సో చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ మాట్లాడారు. పిల్లలు చైల్డ్ హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వారి హక్కులకు ఎటువంటి భంగం కలిగిన ఈ 1098 నంబర్‌కి కాల్ చేయాలని సూచించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆమెకు పెన్ గంగా గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షి షా పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.
ఇంద్రవెల్లి ఏజెన్సీ ప్రాంతంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల క్రితం నార్నూరులోని వ్యాపారి ఇంట్లో, వైన్ షాపులో చోరీ జరగింది. అది మరవకముందే గురువారం రాత్రి ఉట్నూర్ ఎక్స్ రోడ్, లోకారి, ఈశ్వర్ నగర్ వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం వైన్ షాపు యజమానులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్‌కు చెందిన సక్రి అశ్విని అదృశ్యమైనట్లు 2 టౌన్ ఎస్ఐ విష్ణుప్రకాశ్ తెలిపారు. బుధవారం ఇంద్రవెల్లి నుంచి మహారాష్ట్రలోని పూణేకు వెళ్లేందుకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. వారందరు రైలు ఎక్కగా, ఆమెతో పాటు కుమార్తె పియు కనిపించకుండా పోయారు. దీంతో భర్త గోరక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
స్కౌట్స్&గైడ్స్ వ్యవస్థాపకుడు బేడెన్ పావెల్ దంపతుల జన్మదిన పురస్కరించుకొని ఈనెల 22న ADBలోని స్కౌట్స్&గైడ్స్ కార్యాలయ ఆవరణలో ‘థింకింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ ప్రణీత తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చెందిన స్కౌట్స్ మాస్టర్లు, గైడ్ క్యాప్టెన్లు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యం ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.