India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఈనెల18న మహేందర్‌ని అతడి బామ్మర్ది అశోక్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన అశోక్‌ను పట్టుకొన్నట్లు ADBడీఎస్పీ జీవన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 48 గంటల్లోనే పట్టుకుని నిందితుడిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ సీఐ ఫణిందర్ తెలిపారు. కార్యక్రమంలో తలమడుగు ఎస్సై బి.అంజమ్మ ముజాహిద్ పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవితోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గురువారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షించారు. ప్రజాపాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుటకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని RWS అధికారులను ఆదేశించారు.
ఆధార్ సర్వర్ పునరుద్ధరణ అయినట్లు, ఈనెల 21 శుక్రవారం నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి గజానంద్ తెలిపారు. నాణ్యమైన పత్తిని మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. కౌడి పుచ్చుకాయ నిమ్ము పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మార్కెట్ యార్డ్ సహకరించాలని కోరారు.
గ్యాస్ ఏజెన్సీలతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్శి షా తన ఛాంబర్‌లో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా గ్యాస్ సబ్సిడీ అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సబ్సిడీ అందని లబ్ధిదారుల వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు. లబ్ధిదారులకు సబ్సిడీ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్యామల దేవి, అధికారులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ సమీపంలో బుధవారం రెండు ద్విచక్ర ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న కేస్లాగూడ కు చెందిన మడవి రామ్ శావ్ (47) ను HYDకు రిఫర్ చేశారు. ఎదురుఎదురుగా వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులు మడావి బళ్ళు, ఉట్నూర్ కు చెందిన శ్రీను, నాగన్నలకు 108 ఈఎంటి ఆత్రం అశోక్ ప్రథమ చికిత్స చేసి రిమ్స్‌కు తరలించారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి దంపతులు గాయాలపాలైన ఘటన బుధవారం రాత్రి మావల వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాంసీ మండలం పొన్నారికి చెందిన పోషట్టి- ఆశమ్మ లు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మావల సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన క్రషర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా 108 అంబులెన్స్ ఈఎంటీ విశాల్, పైలెట్ ముజ్జఫర్ వారికి ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇంతకముందు ప్రజా పాలనలో గాని, గ్రామ సభలలో గాని రేషన్ కార్డు కోరకు దరఖాస్తు చేసుకున్నట్లైతే వారు మళ్ళీ మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని డీఎస్ఓ వాజిద్ ఆలీ ఒక ప్రకటలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారి జాబితా మండల తహసీల్దార్ల నుండి సేకరించమన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్ కోసం కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుట కోరకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించాలని అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. బుధవారం ప్రజాసేవ భవన్ లో కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి పనిచేసినవారికి కాంగ్రెస్‌లో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పలువురు చేరారు.
ఆదిలాబాద్ జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బొంపెల్లి భూమన్న (59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదిలాబాద్‌లోని వికలాంగుల కాలనీలో నివాసముంటున్న భూమన్న బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా భూమన్న ఆకస్మిక మరణంతో గంగపుత్ర సంఘం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Sorry, no posts matched your criteria.