India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీత దయాకర్‌రెడ్డిని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బాలల పరిరక్షణ, దత్తత, విద్య, ఎన్‌జీవోల పాత్ర వంటి వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు పురుషోత్తం రెడ్డి తెలిపారు.

పర్యావరణాన్ని రక్షించేందుకు, నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల కలిగే హానిని నివారించేందుకు మట్టి గణపతులు దోహదపడుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. 2,000 ఎస్‌హెచ్‌జి గ్రూపులకు, 1,000 మెప్మా ఆర్‌పీలకూ మట్టి విగ్రహాలను అందజేశారు.

ఆదిలాబాద్ ఎఫ్‌డీఓగా శిక్షణ ఐఎఫ్ఎస్ చిన్న విశ్వనాథ బుసరెడ్డి నియామకమయ్యారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి పరిచయం చేసుకున్నారు. జిల్లాలో అడవుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి అడవి జంతువులను కాపాడటం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. పోలీస్, ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు.

ADB ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో BA రెండో సంవత్సరం చదువుతున్న కుమ్ర శశికాంత్ నేవీలో ఉద్యోగం సాధించాడు. సోమవారం కళాశాలలో శశికాంత్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం ఘనంగా సన్మానించారు. దేశ సరిహద్దుల్లో సేవ చేయడానికి తమ కళాశాల విద్యార్థి వెళ్లడం గర్వకారణమని అభినందనలు తెలిపారు.

భారీ వర్షాలకు ఆదిలాబాద్ అర్బన్‌లో జలమయమైన లోలెవల్ బ్రిడ్జిలు.. హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిషా సోమవారం సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. దుర్గానగర్, కోజా కాలనీ, సుభాష్ నగర్ తదితర ప్రాంతాల బ్రిడ్జిలను హై లెవెల్ బ్రిడ్జిలుగా రూపొందించడానికి శాశ్వత పరిష్కార మార్గంపై చర్చించారు.

గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దడం పోలీసులు ప్రధాన లక్ష్యం అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నార్నూర్ మండలం సుంగాపూర్‌లో గంజాయి పండిస్తున్నారని సమాచారం మేరకు సీసీఎస్, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ భూమిలో 95 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి పండించిన కొడప దేవురావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ మండలం అంకోలిలో ఆయన ఇరువర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా పోలీసులను సంప్రదించాలని కోరారు. వాట్సాప్ గ్రూపుల్లో గొడవలకు దారి తీసే పోస్టులు పెట్టవద్దని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల శాపంగా మారిన సీపీఎస్ రద్దు పరిచి ఓపీఎస్ అమలు చేయించడమే పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన లక్ష్యమని తెలంగాణ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నూర్ సింగ్, నవీన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ వద్ద జరిగిన విరమణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్నారు.

తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఆదిలాబాద్ జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చే లక్ష్యంతో పోలీసులు మాదకద్రవ్యాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు కాలనీలు, దుకాణాల్లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ రోమా సహాయంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సాగు చేసేవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.