India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
రెబ్బన మండలం గోలేటికి చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి సీనియర్ సెపక్ తక్రా మేనేజర్లుగా ఎంపికయ్యారు. ఆదివారం గోలేటిలో తెలంగాణ రాష్ట్ర సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 10నుంచి 14వరకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 34వ సీనియర్ జాతీయస్థాయి మహిళల టీం మేనేజర్‌గా పర్లపల్లి శిరీష, పురుషుల మేనేజర్‌గా రామకృష్ణారెడ్డి ఈనెల 11న ఎంపికయ్యారని తెలిపారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
నార్నూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2025 సంవత్సరానికి 100 సీట్లకు ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రశాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలలో 7 తరగతి నుంచి 9వ తరగతిలో మిగిలిన సీట్లకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్షకోసం అర్హులైన విద్యార్థులు https Telangana ms.cgg.giv.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్ పెళ్లి రేంజ్ అడవులలో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణహైకోర్టు జడ్జి రాధారాణి కుటుంబ సమేతంగా పర్యటించారు. ముందుగావారికి పోలీసులు అటవీ శాఖ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జంగల్ సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లి అందాలను తిలకించారు. అటవీ అధికారులువారికి అన్ని ఏర్పాట్లు చేశారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని జిల్లా SPశ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో స్నేహపూర్వక వాతావరణంలో పోలీస్, ప్రెస్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో పోలీస్ టీం విజేతగా నిలిచింది. విజేత, రన్నరప్ టీంలకు SP బహుమతులు అందజేశారు.
జన్నారం మండలం కొత్తూరుపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఎస్ఐ రాజ వర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మడావి కౌసల్య అనే మహిళకు అదే గ్రామానికి చెందిన కృష్ణతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణ గొడ్డలితో కౌసల్యను నరికి చంపాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై నిర్మల్ పాత బస్టాండ్, ట్యాంక్ బండ్, మయూరి సర్కిల్ ఏరియాలో ఎస్పీ జానకీషర్మిల శనివారం పర్యటించారు. అందులో భాగంగా పాత బస్టాండ్ ఏరియాలో ఆటో నడుపుతున్న మహిళా డ్రైవర్‌ను ఎస్పీ ఆప్యాయంగా పలకరించారు. డ్రైవింగ్ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
బెల్లంపల్లి ఏరియా కైరుగూడ ఓపెన్ కాస్ట్లో జీఎం శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, గుర్తింపు AITUC సంఘం నాయకులు క్యాంటీన్‌ను శనివారం తనిఖీ చేశారు. క్యాంటీన్లో కార్మికులకు అందుతున్న అల్పాహారం, భోజనం, ఏర్పాట్లను పరిశీలించారు. జీఎం మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని పర్సనల్ ఆఫీసర్ వేణును ఆదేశించారు. యూనియన్ నాయకులు అధికారులు ఉన్నారు.
బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో చదివే పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ సెలవులను వర్సిటీ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు సెలవులిచ్చారు. 19న ఆదివారం సాధారణ సెలవుదినం రావడంతో తరగతులు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.