India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళాగ్యాంగ్‌ను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్థానిక ఇంద్రానగర్‌లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో ఫర్జానా సుల్తానా అనే మహిళ పోలీస్ స్టేషన్‌కు రానని.. తనను స్టేషన్కు తీసుకెళ్తే గొంతు కోసుకుంటానంటూ పోలీసులను బెదిరించింది. బ్లేడుతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపెట్టించింది. దీంతో ఆమెపై మట్కా కేస్‌తోపాటు బెదిరించినందుకు మరో కేసును నమోదు చేసినట్లు CI కరుణాకర్ తెలిపారు.

బజార్హత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన సిరాజ్ ఖాన్ సోమవారం విడుదలైన హెచ్ డబ్ల్యూ ఓ(HWO) ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. దీంతో కష్టపడి ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సిరాజ్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సీతాగొంది గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) అనే వ్యక్తి సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటి విశాల్, పైలెట్ ముజాఫర్ బాధితున్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. కాగా ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతోపాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయుటకు సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. వేసవి వడగాల్పులు నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలంలో వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

సహజంగా ఏ రైతైనా పంట కాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలి కాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి K.ప్రభాకర్ రావు, అదనపు డిస్ట్రిక్ట్ సెక్షన్స్ జడ్జి డాక్టర్ పి.శివరాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై చర్చించారు. రానున్న లోక్ అదాలత్ లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.

‘అగ్నిపథ్’ స్కీం క్రింద అగ్నివీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ www.joinindianarmy.nic.in అధికారిక వెబ్ సైట్లో ప్రారంభమైందని ఆదిలాబాద్ డీఐఈఓ జాదవ్ గణేశ్ తెలిపారు. అగ్నివీర్‌లోని వివిధ కేటగిరీల కింద నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతి వివరాల ప్రకారం.. ఇచ్చోడలోని శివాజీ చౌక్ వద్ద గల పాన్ షాప్ వద్ద సయ్యద్ రావుఫ్ (38) మృతి చెంది పడిఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి బావ మరిది ఆసిఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.