Adilabad

News June 7, 2024

ఆదిలాబాద్: హమ్మయ్య..! చల్లబడిన వాతావరణం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఎండవేడిమి తగ్గినా.. ఉక్కపోత అలాగే ఉండటంతో ఒకటి, రెండు భారీ వర్షాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు ఉగ్రరూపం చూపిన భానుడు వర్షం ప్రభావం వల్ల కొంత చల్లబడ్డాడు. ఈ నెలలో 47 డిగ్రీల వరకు చేరుకున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 37, 35 డిగ్రీలకు పడిపోయాయి.

News June 7, 2024

ADB: పిడుగు పాటుతో నలుగురు మృతి 

image

ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్కరోజే పిడుగు పాటుకు 4 గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయాయి. దిలావర్పూర్ మండలానికి చెందిన ప్రవీణ్(26), ఇంద్రవెల్లి మండలానికి చెందిన దంపతులు సంతోష్(26), స్వప్న(23), తానూర్ మండలానికి చెందిన మాగిర్వడ్ (13) పిడుగు పాటుతో మృతి చెందారు. పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News June 7, 2024

నిర్మల్: పిడుగు పడి బాలుడు మృతి

image

పిడుగు పడి బాలుడు మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన మగీర్వాడ్ శ్రీ (10) గురువారం పిడుగు పాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. శ్రీ ఉదయం మేకలు మేపడానికి వెళ్లాడు. మద్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. తండ్రి సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News June 7, 2024

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు రేపే లాస్ట్ డేట్

image

ఉమ్మడి ADB జిల్లా నిరుద్యోగ యువకులకు (NAC) ద్వారా అందించే శిక్షణకు దరఖాస్తు గడువు రెపటితో (జూన్ 8) ముగియనుందని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం తెలిపారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, తదితర కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 6, 2024

ఇంద్రవెల్లి: పిడుగుపాటుతో భార్యాభర్తలు మృతి

image

పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలోని దొంగర్గావ్ శివారులో జరిగింది. గ్రామానికి చెందిన స్వప్న, సంతోష్ భార్యాభర్తలు. గురువారం సాయంత్రం పొలానికి వెళ్లారు. ఈదురు గాలులతో భారీ వర్షం రావడంతో అక్కడే ఉన్న చిన్న గుడిసెలో తలదాచుకున్నారు. ఆ సమయంలో పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

News June 6, 2024

నిర్మల్: పిడుగుపాటుకు గురై యువ రైతు మృతి

image

పిడుగుపాటుకు గురై ఓ యువ రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మూడపెల్లి ప్రవీణ్ (28) వానాకాలం సాగు కోసం పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగుపడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, సంవత్సరం కూతురు ఉన్నారు.

News June 6, 2024

మంచిర్యాల జిల్లాలో ఘోర అమానవీయ ఘటన

image

మంచిర్యాల పట్టణంలోని దొరవారిపల్లెలో ఘోర అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 6, 2024

ఆదిలాబాద్ ఎంపీకి మంత్రి పదవి వరించేనా..?

image

కేంద్రంలో మరోసారి NDA ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాష్ట్రం నుంచి మంత్రి పదవుల ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రానికి ప్రాధాన్యం పెరిగింది. కాగా దేశంలో మెుత్తం 47 ఎస్టీ లోక్ సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెంనగేశ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా అనే దానిపై చర్చ మెుదలైంది.

News June 6, 2024

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రికార్డ్

image

రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికై న వారిలో పెద్దపల్లి ప్రాతినిధ్యం వహించనున్న గడ్డం వంశీకృష్ణ(35) చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కాగా వంశీకృష్ణ(35) యూఎస్‌లో సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఈయన తండ్రి 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం చెన్నూరు MLAగా ఉన్నారు.

News June 6, 2024

ఆదిలాబాద్; కనుమరుగైన ‘కారు’..!

image

ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో ‘కారు’ కనుమరుగైంది. ఏ నియోజకవర్గంలోనూ తన పట్టును నిలుపుకోలేకపోయింది. గతేడాది ఎమ్మెల్యే ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో BRS పార్టీకి 55,697 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 8,512 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముథోల్‌లోనూ అప్పుడు 74,253 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 12,505 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఖానాపూర్‌లో ఆ ఎన్నికల్లో దాదాపు 25 వేల ఓట్లు రాగా ఇప్పుడు 7,464 ఓట్లు మాత్రమే వచ్చాయి.