Adilabad

News January 6, 2025

కాంగ్రెస్‌కు ఆదిలాబాద్ సెంటిమెంట్

image

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్ష సోమవారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తున్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్ధేశం చేయనున్నారు.

News January 6, 2025

ADB: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్.. జాగ్రత్త.!

image

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. కాగా, చైనా మాంజాలు వాడినా, విక్రయించినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News January 6, 2025

సారంగాపూర్‌: డిసెంబర్ 31న గొడవ.. కత్తితో పొడిచారు

image

ఓ యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. CI రామకృష్ణ వివరాలు.. సారంగాపూర్ మండలం బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్, సాయికుమార్, మరో బాలుడు డిసెంబర్ 31న గొడవపడ్డారు. అది మనసులో పెట్టుకున్న సాయికుమార్ సదరు బాలుడితో కలిసి ఈనెల 4న అర్షద్‌ను గ్రామంలోని ఓ కూడలి వద్దకు రప్పించి కత్తితో పొడిచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.

News January 6, 2025

ఉమ్మడి ADBపై చలి పంజా

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఆదివారం ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా అర్లి(T)లో 5.9, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(U) 6.0, నిర్మల్ జిల్లాలో పెంబి 8.0, మంచిర్యాల జిల్లాలో నెన్నెల 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గాయి.

News January 6, 2025

కౌటాల: ప్రేమజంట పెళ్లి చేసిన పోలీసులు

image

ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కౌటాల మండలం గురుడు‌పేట్‌కు చెందిన నీకా సాయికుమార్(27), కన్నెపల్లికి చెందిన మానస(20) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసినట్లు కౌటాల SI మధుకర్ తెలిపారు. ఇందులో గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

News January 6, 2025

ASF: ఎమ్మెల్సీ కవిత పర్యటన జయప్రదానికి పిలుపు

image

బీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని ASF ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్, కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో కవిత పర్యటిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.

News January 6, 2025

సారంగాపూర్‌: కత్తితో పొడిచారు.. అరెస్టయ్యారు

image

ఓ యువకుడిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అరెస్టయిన ఘటన సారంగాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. గ్రామీణ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్ అదే గ్రామానికి చెందిన సాయికుమార్ డిసెంబర్ 31న గొడవపడ్డారు. ఇది మనసులో పెట్టుకున్న సాయికుమార్ ఓ మైనర్‌తో కలిసి ఈ నెల 4న కత్తితో అర్షద్‌ను పొడిచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అరెస్టు చేశారు.

News January 6, 2025

ASF: భరోసా కేంద్రం సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

image

లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ భరోసా సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ గురించి, సెంటర్‌లో పనిచేసే ఉద్యోగుల విధులు తెలుసుకున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, సంబంధిత ఫైళ్లను తనిఖీ చేశారు. సిబ్బందికి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి భాస్కర్, భరోసా ఉమెన్ ఎస్సై తిరుమల, లీగల్ అడ్వైజర్ శైలజ తదితరులు ఉన్నారు.

News January 5, 2025

ఆదిలాబాద్‌ @ 5.9 డిగ్రీలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత భీంపూర్ మండలం అర్లి (టి)లో 5.9 డిగ్రీలు నమోదైంది. సిర్పూర్ (యూ)లో 6.0, తిర్యాణి (6.1), బేల 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబి(8.0), మంచిర్యాల జిల్లా నెన్నెల (9.5) డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా చలికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

News January 5, 2025

ఆదిలాబాద్‌: చెప్పుల షాపులో చోరీ.. దొంగ అరెస్ట్

image

ఇటీవల చెప్పుల షాపులో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. ఈనెల 2న చెప్పుల షాప్‌లో రూ.2వేల నగదును దొంగిలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాగా శనివారం పట్టణంలోని పంజాబ్ చౌక్‌లో ఎస్ఐ అశోక్ వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగ పట్టుబడ్డారు. 

error: Content is protected !!