India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. శనివారం ఉష్ణోగ్రతలు అతి అల్పానికి చేరుకున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా సిర్పూర్(U) 6.1, ఆదిలాబాద్ జిల్లాలో అర్లి(T) 6.2, నిర్మల్ జిల్లాలో కుబీర్ 8.8, మంచిర్యాల జిల్లాలో జైపూర్ 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లా వాసులు తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని రైతుల పొలాలకు ఎమ్మెల్యే బొజ్జు సాగునీటిని విడుదల చేయనున్నారని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. రబీ సీజన్‌కు సంబంధించి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న రైతుల పొలాల్లో వేసే పంటల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదివారం ఉదయం 10 గంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారని వారు వెల్లడించారు. విషయాన్ని రైతులు, అందరూ గమనించాలని వారు సూచించారు.
పెద్దపులి దాడిలో 3 ఆవులు మృతి చెందిన ఘటన భీంపూర్‌లో చోటుచేసుకుంది. మండలంలోని పిప్పల్ కోటి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో శుక్రవారం మేతకు వెళ్లిన 3 ఆవులపై పులి దాడి చేసి చంపేయగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతులు పంట చేలకు వెళ్లాలంటే జంకుతున్నారు.
మందమర్రి మండలం పులిమడుగు ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. మంచిర్యాల ర్యాలీగడ్‌పూర్‌కు చెందిన రాజు(24) భీమిని మండలంలోని భీంపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకొని చనిపోయినట్లు చెప్పారు.
సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా అభినందించారు. వివిధ ఆటల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని 43 మెడల్స్ సాధించి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులను శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అభినందించారు. మెడల్స్, ప్రశాంత పత్రాలు అందజేశారు. డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.111.24 కోట్ల నగదును సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ శుక్రవారం తెలిపారు. 317 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 81,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 9,573 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో కొనుగోలు లక్ష్యం పూర్తికావడంతో మూసి వేసినట్లు వెల్లడించారు.
మంచిర్యాల జోన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకూడదని CPశ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1 వరకు నిషేధాజ్ఞాలను కొనసాగిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఆగడాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మొదటి ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సావిత్రిబాయి ఫూలేను మహిళా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సావిత్రిబాయి జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి రమాదేవి, విద్యాశాఖ అధికారులతో కలిసి హాజరై సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదామని CP శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ పరిధి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం CP సమీక్ష నిర్వహించారు. CP మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31వ వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్-Xlను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రతి ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను కాపాడాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ షమీమ్ అక్తర్ గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో ఆయనను కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.