India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్‌లో గురువారం రాత్రి బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంకోలి రోడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ఒక కారును ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని ఢీకొంది. దీంతో భీంపూర్ మండలంకు చెందిన గణేష్, ఆదిలాబాద్‌కు చెందిన వెంకట్, నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలోని మున్సిపాలిటీలలో పాలకవర్గం పూర్తయిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను ఆధ్వర్యంలో పాలను కొనసాగుతుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలలో ఆశావాహులు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఒక వార్డుకు సుమారు ఐదుగురు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో మొట్టమొదటి సారి ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రారంభమైందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఇంద్రవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బహిరంగ విచారణ జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేదన్నారు. DRDA పీడీ రవీందర్, కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీహర్ష, తదితరులు పాల్గొన్నారు.
కేస్లాపూర్‌లోని నాగోబా జాతర హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం ఆదాయం రూ.21,08,511 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో రాజమౌళి తెలిపారు. పీఠాధిపతి వెంకట్‌రావ్ పటేల్, దేవాదాయశాఖ సీఎఫ్‌వో రవి, ఆలయ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావు తదితరులున్నారు.
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో RRB, SSC బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 4నెలల ఉచిత శిక్షణ, బుక్ ఫండ్, ప్రతినెల స్టైఫండ్ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్‌లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని ప్రారంభించారు. పదోతరగతి విద్యార్థులకు వార్షికపరీక్షలకు అవసరమైన సామగ్రిని కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో సుమారు 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుడు బంధం బాపిరెడ్డి(50) గుండెపోటుతో ఈరోజు మరణించాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో నేటి ఉదయం షటిల్ ఆడుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మరణించినట్లుగా మృతుడి మిత్రులు తెలిపారు. అధ్యాపకుడి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లో చికెన్ ధరలు యథావిధిగా ఉన్నాయి. నెల రోజుల క్రితం కిలో రూ.220కి పైగానే అమ్మారు. నేటి ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.200 నుంచి రూ.210, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు పాలనాధికారి శ్యామలాదేవి కలిసి ప్రారంభించారు. నూతన మండలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరలో పూర్తిచేస్తామన్నారు. సంబంధిత కార్యాలయాల నిర్మాణాలకు నివేదికలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ పాలనాధికారి మాల్వియా, ఆర్డీఓ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.