India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఈ నెల 21న ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు చెట్ల పోశెట్టి అలియాస్ అనిల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ డిఎస్పీ సీహెచ్ నాగేందర్ తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం నిందితుడిపై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇచ్చోడ సీఐ భీమేష్ తదితరులున్నారు.
డ్రైవర్‌ను బండరాళ్లతో కొట్టి కారును దుండగులు ఎత్తుకుపోయిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. CI అబ్జాలుద్దీన్ వివరాల ప్రకారం..ముగ్గురు వ్యక్తులు కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లాలని కారు కిరాయి మాట్లాడుకొని బయలుదేరారు. బెల్లంపల్లి వద్ద కారు ఆపి డ్రైవర్‌ను కొట్టి అతను వద్దనున్న రూ.3,500/-నగదు, సెల్ ఫోన్ దొంగిలించారని డ్రైవర్ పురుషోత్తం కొడుకు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయిందని సీఐ వివరించారు.
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగేశ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ పుట్టినరోజును సుపరిపాలన దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్ష హోదాలో వరంగల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆదివాసీ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
తాండూరు మండలంలోని నీలాయపల్లికి కూత వేటు దూరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూడపై దాడి చేసింది పెద్దపులా.. చిరుత పులా అనేది తెలియాల్సి ఉంది. దూడపై పులి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయన్షి రన్నర్‌గా నిలిచినట్లు మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పుల్లూరి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్ తో హోరాహోరీగా తలపడి రన్నర్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీయన్షిని ఆయన అభినందించారు.
పాలు తాగి తల్లి ఒడిలో పడుకోవాల్సిన పిల్లల జీవితం అంధకారంగా మారింది. ASF జిల్లా పెంచికల్‌పేట్‌లో ఓ కుక్క 6 పిల్లలకు జన్మనిచ్చి 4 రోజుల క్రితం చనిపోయింది. దీంతో వాటికి పాలిచ్చేందుకు, చలికి తలదాచుకునేందుకు తల్లి ఒడి దూరమైంది. తల్లి చనిపోయిన విషయం తెలియక ఎముకలు కొరికే చలిలో నాలుగు రోజుల నుంచి ఓ ఆవు పక్కన తలదాచుకుంటున్నాయి. తల్లి కోసం పసిప్రాయాలు అల్లాడుతుంటే స్థానికులు చలించి పాలు అందించారు.
గొడ్డలితో ఓ వ్యక్తిపై దాడి జరిగిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. కుప్టి గ్రామానికి చెందిన విజయ్ ఆదివారం సాయంత్రం కస్రా గ్రామానికి మద్యం తాగడానికి వెళ్లాడు. నడుచుకుంటూ కుప్టి వెళ్తుండగా వెనక నుంచి ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న యువకుడిని స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.