Adilabad

News May 28, 2024

ఆసిఫాబాద్: అన్న మందలించడంతో చెల్లి ఆత్మహత్య

image

అన్నయ్య మందలించాడని చెల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పల్ నవేగాం గ్రామానికి చెందిన గుమ్మూల సుష్మా పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. అన్నయ్య అరుణ్.. తన చెల్లెలిని ‘ఇంట్లోనే ఖాళీగా ఉంటావు ఏదైనా పని చేసుకోవచ్చు’ అని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన సుష్మా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News May 28, 2024

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: మూగ జీవుల సేవా సంఘం

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మూగజీవుల సేవా సంఘం జిల్లా నాయకులను డిమాండ్ చేశారు. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో బంజరు దొడ్డిలో ఆవులను బందీగా ఉన్నాయని తెలుసుకొని ఆవులను విముక్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు కటకం నాగరాజు మాట్లాడుతూ.. గోవులలో ముక్కోటి దేవతలు ఉంటాయని భారతీయులు పూజిస్తున్న గోమాతకు ఇంతటి దుస్థితి రావడం చాలా బాధాకరమన్నారు.

News May 27, 2024

ALERT: రాష్ట్రంలో.. మంచిర్యాలలోనే అత్యధికం

image

రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాలో సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు వర్షాలు పడినప్పటికీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బెల్లంపల్లిలో 45.7 హజీపూర్‌లో 44.9 డిగ్రీలు, అసిఫాబాద్‌లో 44.9, తిర్యాణిలో 44.9, మంచిర్యాల కొండాపూర్ 44.8, కౌటాల 44.7, వాంకిడిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 27, 2024

BREAKING: బాసర IIITలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసరలో IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రెటేడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.

News May 27, 2024

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

image

మామడ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఒకరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌హెచ్‌ 61పై దిమ్మదుర్తి గ్రామం నుంచి వస్తున్న బొలెరో, నిర్మల్‌ వైపు నుంచి వస్తున్న బైక్‌ ఢీకొనగా బైక్‌పై ఉన్న ప్రవీన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్‌ వెనుక కూర్చున్న శేఖర్‌కు గాయాలు కాగా నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 27, 2024

‘విద్యుత్ సమస్య ఉంటే ఈనంబర్‌కు సంప్రదించండి’

image

ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్న వాటిని విద్యుత్ సిబ్బందికి తెలియజేసేందుకు విద్యుత్ శాఖ ఒక సెల్ నంబర్‌ను అందుబాటు లోకి తెచ్చిందని ఆ శాఖ SE జె.ఆర్ చౌహాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్న జిల్లా వ్యాప్తంగా ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ ను సర్కిల్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. అందులో 9440811700 అనే నంబర్ కు కాల్ చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News May 27, 2024

దహేగాం: ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల వ్యవసాయ అధికారి సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రూ‌.38,000 డబ్బులు తీసుకుంటుండగా వ్యవసాయ అధికారి వంశీ క్రిష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు వ్యవసాయ అధికారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News May 27, 2024

ADB: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారు పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. https://padmawards.gov.inలో జూన్ 3 లోపు సంబంధిత వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.

News May 27, 2024

ASF: విధి చిన్నచూపు.. అనాథలైన చిన్నారులు

image

విధి చిన్నచూపు చూసి ముగ్గురు చిన్నారులను అనాథులుగా మిగిల్చిన విషాద ఘటనిది. ASF(జి) కౌటాల(మం) పార్డికి చెందిన దివాకర్‌(36)కు, దహేగాంకు చెందిన భారతితో 2010లో పెళ్లైంది. వీరికి అజిత్‌, విజయ్‌ సంతానం. అనారోగ్యంతో 2013లో భారతి చనిపోగా.. దివాకర్ మరో పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల కింద మగ శిశువుకు జన్మనిచ్చిన రెండో భార్య 5రోజులకే కన్నుమూసింది. ఈనెల 25న దివాకర్ సైతం అనారోగ్యంతో చనిపోగా పిల్లలు అనాథలయ్యారు.

News May 27, 2024

ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో 45.8 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలో 44.9, ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి టీ గ్రామంలో 45.2, నిర్మల్ జిల్లాలోని ముజ్గి గ్రామంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.