India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఎస్సీ కాలనీలో ఇవాళ ఉదయం పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజలు చేశారా లేక ఎవరైనా కావాలని అలా రోడ్డుపై వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సమీపంలో గత రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు నాగోబా జాతరకు వెళ్తుండగా వారి బైక్, ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బోథ్‌కు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు భారతాల గోవర్ధన్ నియమితులయ్యారు. గత రెండు రోజులుగా AITUC మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్లలో జరగగా ఆ మహాసభల్లో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం గోవర్ధన్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. బీడీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని గోవర్ధన్ తెలిపారు.
దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే క్రూర మృగం హైనా ఆదిలాబాద్ జిల్లా మావల అడవుల్లో సంచరించడం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో హైనా దృశ్యాలు రికార్డయ్యాయి. మావల హరితాహారం లోని సీసీ కెమెరాల్లో ఈ చిత్రం శుక్రవారం కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన హైనాలు తిరిగి మావల అడవుల్లో కనిపించిందన్నారు.
జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్, వీరేష్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జనవరి 27 నుంచి 30వ వరకు పోటీలు జరిగినట్లు పేర్కొన్నారు. జిల్లాకు 2 స్వర్ణ, 3 వెండి, 5 రజత పతకాలు వచ్చాయన్నారు.
ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో రాష్ట్రమంత్రి సీతక్క శుక్రవారం పర్యటించారు. గ్రామంలో కొలువుదీరిన దైవం బుడుందేవ్‌ను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేష్, మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర నేపథ్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రజాదర్బార్ శుక్రవారం శాంతియుత వాతావరణంలో జరిగింది. ఈ సందర్బంగా ప్రజావాణిలో ప్రజల సమస్యల దరఖాస్తులను స్వీకరించగా వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి జిల్లా MLC, MLAలు, కాంగ్రెస్ ముఖ్యనాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి ఆదివాసీ పెద్దలు, మహిళలు, ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని భరంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహేందర్ యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆదిలాబాద్ DEO నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలితో సదరు ఉపాధ్యాయుడు అసభ్యకర పద జాలముతో వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ప్రజా దర్బార్‌ను పురస్కరించుకొని నేడు (శుక్రవారం) విద్యాసంస్థలకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా సెలవు ప్రకటించారు. ఈ సెలవు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ సెలవు మార్చి 8న పని దినంగా పరిగణించాలని సూచించారు. పరీక్షలు జరిగే ఇంటర్ కళాశాలలకు ఈ సెలవు వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.