India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్చోడ మండలం దుబాయ్ పేటకు చెందిన ఆదివాసీ కళాకారులు దిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను కనబర్చారు. ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని కొమ్ము కోయ నృత్యం ప్రదర్శించామన్నారు. తమ ప్రతిభతో అందరినీ మెప్పించినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్యంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) HYD బ్రాంచ్ మేనేజింగ్ కమిటీకి ADBకు చెందిన CA శైలేష్ ఖండేల్వాల్ ఎన్నికయ్యారు. 2025-2029 కాలానికి ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలికి మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా పట్టణానికి చెందిన వ్యక్తి ఎన్నికకావడం విశేషమైంది. ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎంపీ నగేష్ ఎమ్మెల్యే, వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో, లాల్ టేక్డిలోని గిరిజన సంక్షేమ కళాశాలతో పాటు యేందా గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో నూతన అదనపు గదులు, వంట గదుల భవన నిర్మాణాలకు వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.
ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్‌లో లంచం తీసుకుంటూ పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి రమేశ్ రాథోడ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాగా బుధవారం తన కార్యాలయంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆయనను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర వద్ద ఈనెల 30న గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం సాయంత్రం 6.00 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రజలందరూ హాజరై తిలకించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మన్నూర్ గ్రామం వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఎవరు అన్నది ఇంకా గుర్తు తెలియరాలేదు.
పురుగుమందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. SI తెలిపిన వివరాల ప్రకారం.. బోరిగామకు చెందిన బోల్లి రాజు(40) గ్రామ సంఘం నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు. అప్పు కట్టాల్సిన తేదీ రావడంతో తీసుకున్న డబ్బులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందారు. దీంతో గ్రామ సమీపంలోని పత్తి చేనులో పురుగుమందు తాగి మృతి చెందినట్లు SI తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,950గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.110తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాకు అత్యధికంగా నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం సిరికొండ మండలంలోని వాయిపెట్ గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలను తిలకించి, ఆటను ఆడారు. మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,060గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.