Adilabad

News January 27, 2025

ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

image

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్‌తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.

News January 27, 2025

ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన ADB కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను ఆదివారం జైనథ్ మండలం పిప్పర్ వాడ గ్రామంలో కలెక్టర్ రాజర్షి షా లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకుల పాల్గొన్నారు.

News January 26, 2025

ADB: నాగోబా స్పెషల్.. ఎందరొచ్చినా 22 పొయ్యిలే

image

ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. జాతరకు మెస్రం వంశీయులు వేలాదిగా తరలివస్తారు. కానీ వారు వంట చేసుకోవడానికి అక్కడ 22 పొయ్యిలను మాత్రమే వినియోగిస్తారు. అయితే ఈ పొయ్యిలను ఎక్కడపడితే అక్కడ పెట్టరు. ఆలయ ప్రాంగణంలోని గోడ లోపల వెలిగే దీపాలు వెలుగుల్లో మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తారు. వంట పాత్రలు, వాటి మీద కప్పడానికి మూతలను సిరికొండలోని గుగ్గిల్ల వంశస్థులు తయారు చేస్తారు.

News January 26, 2025

ADB: బ్యాంకు లాకర్‌లో బంగారం ఆభరణాలు మాయం

image

ఆదిలాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో నుంచి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల బ్యాంకు ఉన్నతాధికారులు సాధారణ తనిఖీలు చేపట్టగా, బ్యాంకు లాకర్‌లో నుంచి 507.4 గ్రాముల బంగారు ఆభరణాలు మిస్సైనట్లు తనిఖీల్లో తేలింది. వీటి విలువ రూ. 29 లక్షల 20 వేలు ఉంటుంది. బ్యాంకు అధికారుల ఆదేశాల మేరకు బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News January 26, 2025

ఇంద్రవెల్లి: పాము కాటుతో రైతు మృతి

image

పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు  వైద్యులు ధ్రువీకరించారు.

News January 26, 2025

ఆదిలాబాద్‌లో వివాహిత అదృశ్యం

image

ఆదిలాబాద్‌లోని ఖుర్షిద్ నగర్‌కు చెందిన వివాహిత అదృశ్యమైనట్లు టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. 32 ఏళ్ల కవిత భర్త చంద్రకాంత్‌కు మధ్య గొడవలు జరిగాయి. దీంతో శనివారం కవిత ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో టూ టౌన్‌లో ఆమె భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ విష్ణు ప్రకాశ్ మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

News January 26, 2025

తాంసిలో పులి సంచారం

image

ఇటీవల భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రాంతంలో పులి కనిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె శనివారం రాత్రి తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో పులి రోడ్డు దాడుతూ కనిపించినట్లు రైతులు స్వామి, అశోక్ తెలిపారు. వాహనాల లైట్ల వెలుతురుకి అది వెళ్లిపోయిందన్నారు.

News January 26, 2025

ఇంద్రవెల్లి: పాము కాటుతో రైతు మృతి

image

పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు  వైద్యులు ధ్రువీకరించారు.

News January 26, 2025

ఓసీ సంఘాల ADB జిల్లా అధ్యక్షుడి రాజీనామా

image

ఓసీ సంఘాల ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు జనగం సంతోష్  తెలిపారు. సంఘ కార్యకలాపాలకు న్యాయం చేయకపోవటంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజీనామా లేఖను జాతీయ కార్యవర్గానికి సమర్పించినట్లు పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

News January 26, 2025

ADB: ‘లబ్ధిదారులు తుది జాబితా సిద్ధం చేయాలి’

image

ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సూచించారు. శనివారం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. నాలుగు సంక్షేమ పథకాల్లో భాగంగా మండలం నుంచి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.