India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తండ్రిని కొడుకు చంపిన ఘటన నిర్మల్‌లో జరిగింది. SI లింబాద్రి వివరాల ప్రకారం.. ముఠాపూర్‌కు చెందిన ముత్యం(47) ఆదివారం రాత్రి తన తల్లిని మద్యం కోసం డబ్బులివ్వాలని కొట్టాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ముత్యం కొడుకు మణిదీప్ నానమ్మను కొట్టాడనే కోపంతో తండ్రిని చితకబాదాడు. కోపం తగ్గకపోవడంతో చీరతో ఉరేసి చంపాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని ఆరాతీయడంతో విషయం బయటపడినట్లు SI వెల్లడించారు.
భీంపూర్ మండలం వడూర్ గ్రామ సమీపంలో ఉన్న పెన్ గంగా నది తీరంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వడూర్ గ్రామస్థులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పెనుగంగా నుంచి జేసీబీలతో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు నింపుకొని గ్రామం నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనీ పేర్కొన్నారు. దీని వలన రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో జగిత్యాల వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం వారు జన్నారం మండలంలోని గోండుగూడా, తదితర అటవీ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి బటర్ఫ్లై పరిరక్షణ కేంద్రం, అడవులు వన్యప్రాణుల సంరక్షణ, తదితర వివరాలను అటవీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాసరలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI గణేశ్ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం సూరారానికి చెందిన రాజేందర్ (25) నిన్న లాడ్జిలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు, తమ్ముడిని బాగా చూసుకో, నిన్ను చాలా కష్టపెట్టిన, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ సూసైడ్ నోట్‌ను అతడి తమ్ముడి ఫోన్‌కు పంపినట్లు SI వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి SGFఅండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల జట్లు ప్రతిభ కనబర్చి కాంస్య పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను SGF సెక్రెటరీలు ఫణిరాజా, వెంకటేశ్వర్, కోచ్, మేనేజర్లు బండి రవి, చంద్ పాషా, రాజ్ మహమ్మద్, కోట యాదగిరి, పలువురు అభినందించారు.
వాటర్ హీటర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తుంది. ఆదివారం నెన్నెలకు చెందిన స్వప్న(22) వాటర్ హీటర్ వాడుతుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. హీటర్ ఆన్ చేసి ఉండగా నీటిని తాకవద్దని, హీటర్ స్వీచ్ ఆఫ్ చేసిన తర్వాతే నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా 5 రోజుల క్రితమే స్వప్న పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
వాటర్ హీటర్ వాడుతున్నారా అయితే జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తీసుకువస్తోంది. నిన్న నెన్నెల మండలానికి చెందిన స్వప్న (22) స్నానం కోసం హీటర్ వాడుతుండగా విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా స్వప్న అయిదు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. హీటర్ ఆన్ చేసి ఉండగా నీటిని తాకవద్దని.. అలాగే హీటర్ స్వీచ్ ఆఫ్ చేసిన తర్వాతే నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందాలోని ఓ గ్రామనికి చెందిన 8ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి శనివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్(36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సుమలత వెల్లడించారు.
HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ బస్తీ 17వ వార్డుకు చెందిన రవితేజ (21) హైదరాబాదులో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి బైక్ పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. వెనకాల వస్తున్న లారీ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
వచ్చే సోమవారం నుండి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలని, గడువులోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు.
Sorry, no posts matched your criteria.