Adilabad

News May 15, 2024

నిర్మల్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన పోలింగ్

image

2019 ఎంపీ ఎలక్షన్‌తో పోల్చితే 2024లో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 15.71 శాతం పెరిగింది. 2019లో 55.97 శాతం నమోదవగా 2024లో 71.68 శాతం ఓటింగ్ పోలైంది. కాగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల వారీగా పెరిగిన పోలింగ్ పరిశీలిస్తే.. నిర్మల్ ముందుండగా సిర్పూర్ అసెంబ్లీ స్థానం 2.01 శాతంతో చివరిలో ఉంది. ఈ మేరకు గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.

News May 15, 2024

మంచిర్యాల: ప్రాణం తీసిన అక్రమ సంబంధం

image

మంగళవారం రాత్రి ఓ యువకుడిని <<13250620>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన మల్యాల నరేశ్ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై పలు సందర్భాల్లో పంచాయతీలు కూడా అయ్యాయి. అయినా మళ్లీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో యువతి సోదరుడు మంగళవారం రాత్రి నరేశ్‌ను ఆటోతో గుద్ది, బండతో మోదీ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 15, 2024

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్ ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్‌గా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బుధవారం రిమ్స్‌లోనే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది స్పందించి ఎంఐసీయూ వార్డ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సూపర్‌వైజర్‌ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 15, 2024

మంచిర్యాల: హాజీపూర్‌లో ఒకరి దారుణ హత్య

image

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఈ మేరకు హాజీపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News May 15, 2024

ఆదిలాబాద్‌: 12,21,563 మంది ఓటేశారు!

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 16,50,175 మంది ఓటర్లు ఉండగా.. 12,21,563 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 74.03 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 71.42 శాతంతో పోల్చుకుంటే దాదాపు రెండున్నరశాతం అధికమే. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

REWIND-2019: ఆదిలాబాద్‌లో BJPకి 58,560 ఓట్ల మెజార్టీ!

image

ఆదిలాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. నగేశ్ (BRS)పై సోయం బాబూ రావు(BJP)58,560 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. రమేశ్ రాథోడ్ (కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో సుగుణకుమారి చెలిమలి(కాంగ్రెస్), గోదం నగేశ్(BJP), ఆత్రం సక్కు (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 14, 2024

ఆదిలాబాద్‌లో పెరిగిన పోలింగ్.. గెలుపెవరిది..!

image

2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్‌లో పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 71.41 % పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 74.03%నమోదైంది. 16,50,175 మంది ఓటర్లు ఉండగా 12,21,563 మంది ఓటు వేశారు. 5,99,108 మంది పురుషులు, 6,22,420 మంది మహిళలు, ఇతరులు 35 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2.5% పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో BJP గెలుపొందగా మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.

News May 14, 2024

పెద్దపల్లి, ఆదిలాబాద్ అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్!

image

ఉమ్మడి ADB జిల్లాలోని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో 12 మంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

కుంటాల: జర్మనీ నుంచి వచ్చి ఓటు వేసిన యువకుడు

image

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నానాజీ పటేల్ -గంగాసాగర దంపతుల కుమారుడు సిందె ఆకాష్ ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లాడు. పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి సోమవారం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దుర్వినియోగం చేయకూడదు అన్న ఉద్దేశంతోనే తాను వచ్చి ఓటు వేశానని తెలిపారు.

News May 14, 2024

MNCL: సంబరపడుతూ కనిపించిన వివేక్‌ వెంకటస్వామి

image

PDPL ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ పుత్రోత్సాహంతో సంబరపడుతూ కనిపించారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయిన ఆయన.. MLA ప్రేమ్‌సాగర్‌రావు అదే కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారని తెలవడంతో మరోసారి వచ్చారు. చిరునవ్వు చిందిస్తూ.. చేయి కలిపేందుకు రాగా ప్రేమ్‌సాగర్‌రావు దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.