India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. కన్నాలబస్తీకి చెందిన రాజేశ్ తన కుటుంబంతో భూపాలపల్లిలోని ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. కారు బెల్లంపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రాజేశ్ అత్త కళ్యాణి, కూతురు ప్రియమేఘన స్పాట్‌లోనే చనిపోయారు. అతడి భార్య అలేఖ్య, కుమారుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు.
సైనిక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులకు TGS RTCలో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు RTC నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,201 డ్రైవింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 92 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 18నెలల అనుభవంతో కూడిన హెవీ డ్యూటీ లైసెన్స్, 58 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి గత రెండు వారాలుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 25న నిర్వహించే ప్రజావాణి కలెక్టరేట్‌లో యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి ప్రజావాణి కార్యక్రమానికి రావాలని సూచించారు.
త్వరలో ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్- కరీంనగర్ పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది పట్టభద్రులు, టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అర్హులు ఇంకా ఎవరైనా ఉండవచ్చన్న అనుమానంతో డిసెంబర్ 9 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి అయిన వాళ్లు ఆన్‌లైన్‌లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం చెల్లాయిపేటకు చెందిన మౌనిక నిన్నవిడుదలైన జెఎల్ (ఇంగ్లీష్) ఫలితాల్లో ఉద్యోగాన్ని సాధించింది. కాగా గతంలో మరో నాలుగు ఉద్యోగాలు సాధించారు. టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్ జాబ్స్ కి ఎంపికయ్యారు. దీంతో ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహతుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తమ కుతూరు అయిదు ఉద్యోగాలు సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు హన్మయ్య- అంకుపోసు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా చేసి పాప ప్రాణాలు కాపాడిన ఘటన గురువారం నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. వైద్యులు సంతోష్ రాజ్ మాట్లాడుతూ.. ఇచ్చోడ మండలానికి చెందిన ఓ గర్భిణి నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అన్నవాహికకు జీర్ణాశయానికి సంబంధం లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్ తెలిపారు.
పది, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం నిర్వహించారు. పదో తరగతలో ప్రత్యేక తరగతులు నిర్వహించి డిసెంబర్ నాటికి సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి జనవరి నుంచి 2025 రివిజన్ చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులకు సూచించారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో డిప్లొమా ఇన్ ఆప్తల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. లిస్ట్‌ను నోటీస్ బోర్డుపై ఉంచామాన్నారు. ఎమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22న రిమ్స్ ఆఫీసులో సంప్రదించాలని, లిస్టులో ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఈ నెల 23న హాజరు కావాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఉన్న కవ్వాల్ అభయారణ్యం పెద్ద పులికి పూర్తిస్థాయి ఆవాసంగా మారిందని అధికారులు అన్నారు. గతంలో మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులులు వచ్చిపోయేవి. ఈసారి మాత్రం రెండు పులులు వచ్చి ఉంటాయని, అందులో ఒకటి ఉట్నూర్-జోడేఘాట్ మీదుగా తడోబాకు వెళ్లి ఉంటే, మరొక పులి నార్నూర్లో మండలంలో సంచరిస్తూ ఉండవచ్చని అధికారులు తెలిపారు. పులులు నివాసాయోగ్య ప్రాంతాలను వెతుకుతున్నాయని వారన్నారు.
ఓ బాలికపై(17) మేనమామ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి వచ్చింది. పోలీసుల వివరాలిలా.. ఆదిలాబాద్‌లోని ఓ కాలనీకి చెందిన బాలికపై మేనమామ కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఎవ్వరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. ఇటీవల బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించగా విషయం తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు DSP పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.