Adilabad

News January 12, 2025

జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్‌లో పర్యటించిన హైకోర్టు జడ్జి

image

కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్ పెళ్లి రేంజ్ అడవులలో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణహైకోర్టు జడ్జి రాధారాణి కుటుంబ సమేతంగా పర్యటించారు. ముందుగావారికి పోలీసులు అటవీ శాఖ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జంగల్ సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లి అందాలను తిలకించారు. అటవీ అధికారులువారికి అన్ని ఏర్పాట్లు చేశారు.

News January 12, 2025

గెలుపోటములు సమానంగా స్వీకరించాలి: ASF SP

image

క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరిస్తూ అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని జిల్లా SPశ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో స్నేహపూర్వక వాతావరణంలో పోలీస్, ప్రెస్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో పోలీస్ టీం విజేతగా నిలిచింది. విజేత, రన్నరప్ టీంలకు SP బహుమతులు అందజేశారు.

News January 12, 2025

జన్నారం: కొత్తూరుపల్లిలో మహిళ హత్య

image

జన్నారం మండలం కొత్తూరుపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఎస్ఐ రాజ వర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మడావి కౌసల్య అనే మహిళకు అదే గ్రామానికి చెందిన కృష్ణతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణ గొడ్డలితో కౌసల్యను నరికి చంపాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 12, 2025

నిర్మల్: మహిళా ఆటో డ్రైవర్‌ను అభినందించిన ఎస్పీ

image

ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై నిర్మల్‌ పాత బస్టాండ్, ట్యాంక్ బండ్, మయూరి సర్కిల్ ఏరియాలో ఎస్పీ జానకీషర్మిల శనివారం పర్యటించారు. అందులో భాగంగా పాత బస్టాండ్ ఏరియాలో ఆటో నడుపుతున్న మహిళా డ్రైవర్‌ను ఎస్పీ ఆప్యాయంగా పలకరించారు. డ్రైవింగ్ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

News January 12, 2025

బెల్లంపల్లి: భోజనం నాణ్యతలో రాజీపడొద్దు. జీఎం

image

బెల్లంపల్లి ఏరియా కైరుగూడ ఓపెన్ కాస్ట్‌లో జీఎం శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, గుర్తింపు AITUC సంఘం నాయకులు క్యాంటీన్‌ను శనివారం తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో కార్మికులకు అందుతున్న అల్పాహారం, భోజనం, ఏర్పాట్లను పరిశీలించారు. జీఎం మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని పర్సనల్ ఆఫీసర్ వేణును ఆదేశించారు. యూనియన్ నాయకులు అధికారులు ఉన్నారు.

News January 11, 2025

బాసర ఆర్జీయూకేటీకీ JAN13 నుంచి సెలవులు

image

బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో చదివే పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ సెలవులను వర్సిటీ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు సెలవులిచ్చారు. 19న ఆదివారం సాధారణ సెలవుదినం రావడంతో తరగతులు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

News January 11, 2025

ASF: రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి.. నిందితుడికి జైలు శిక్ష 

image

మద్యం తాగి నిర్లక్ష్యంగా ఆటో డ్రైవింగ్ చేసి ఆరుగురి మరణానికి కారణమైన నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ1500/-జరిమానా విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ వివరాల ప్రకారం.. 2017లో కెరిమెరికి చెందిన రామచందర్ ఆటో నడుపుతుండగా.. ఒకేసారి బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు.

News January 11, 2025

నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.

News January 11, 2025

జైపూర్: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ అవార్డు

image

జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవార్డును అందుకుంది. శుక్రవారం న్యూదిల్లీలో జరిగిన 3వ జాతీయ పవర్ జనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు లభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యల్పంగా నీటిని వినియోగించినందుకు అవార్డును అందుకున్నట్లు అధికారి D.పంతుల తెలిపారు.

News January 11, 2025

నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండవ గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.