India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పట్టణంలోని ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి విజేతలుగా నిలిచిన వారిని ఎస్పీ గౌస్ ఆలం అభినందించి, పతకాలను అందజేశారు. పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఏఎస్పీ కాజల్, సురేందర్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు తదితరులున్నారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈనెల 12న నిర్మల్‌లో యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వివేకానంద చౌక్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
ఆదివాసుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి వారు వివరించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసీ నాయకులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.
జిల్లా అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి మోహన్‌సింగ్ తెలిపారు. మైనారిటీ అభ్యర్థులకు 4నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి15లోపు ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయధ్రువపత్రాలతో జిల్లా మైనారిటీ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు (కేజీబీవీ మినహా) ఈనెల 11 నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని డీఈవో రామారావు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయని తెలిపారు. ఈనెల 18న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు.ః
అతిగా మద్యం తాగి ఆటో నడిపి ముగ్గురి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ పాలెపు రాకేష్ ను గురువారం అరెస్టు చేసినట్లు బోథ్ సీఐ వెంకటేశ్వర రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న రాకేష్ అతిగా మద్యం తాగి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోను అజాగ్రత్తగా నడపడంతో బజార్హత్నూర్ మండలం దేగామ శివారులో ఆటో బోల్తా పడిందని, ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, గాయపడిన వారు చికిత్స పొందుతున్నారన్నారు.
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)-2025 క్యాలెండర్ ను గురువారం సాయంత్రం 4గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సులేమాన్‌తో కలిసి కళాశాలలోని వివిధ విభాగాలు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు.
ప్రతిష్ఠాత్మక బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్‌లో వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అలిసేరి స్థానం పొందారు. బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్ తన తాజా ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నాయకత్వాన్ని పునర్ నిర్వచించే ప్రముఖ వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా మార్పు, ఆవిష్కరణలకు అభివృద్ధికి సంబంధిన రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరిస్తుంది.
Sorry, no posts matched your criteria.