Adilabad

News January 9, 2025

 సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలి: NRML కలెక్టర్

image

సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోలార్ ప్లాంట్ల స్థల సేకరణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మండలాల్లో అధికారులు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.

News January 9, 2025

ADB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

image

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుందన్నారు. https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News January 9, 2025

విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: ASF కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెన మండలంలోని నంబాల జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News January 8, 2025

ADB: బ్యాంకర్ల వేధింపు.. రైతు ఆత్మహత్య

image

బ్యాంకర్ల వేధింపులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటుచేసుకుంది. SI కమలాకర్ కథనం ప్రకారం.. శివపూర్‌కు చెందిన సంతోష్ ఓ బ్యాంకులో రుణం తీసుకున్నారు. రుణం చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తామని బ్యాంక్ అధికారులు ఇంటికొచ్చి బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు మంగళవారం సాయంత్రం పురుగులమందు తాగారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 8, 2025

ADB: వన్యప్రాణులకు ఉచ్చు.. ముగ్గురి రిమాండ్

image

వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు రేంజ్ అధికారి ముసవీర్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ తెలిపారు. బెజ్జూర్ రేంజ్ పరిధిలోని ఏటిగూడ సమీపంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఏటిగూడెంకు చెందిన మడే ప్రభాకర్, తుమ్మల మహేష్, జక్కం వినోద్ కుమార్ విద్యుత్ అమరుస్తుండగా పట్టుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

News January 8, 2025

జర్నలిస్టులపై మంచిర్యాల MLA వివాదాస్పద వ్యాఖ్యలు

image

మంచిర్యాల ఎమ్మెల్యే జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని TUWJ(IJU) నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష్య,కార్యదర్శులు సత్యనారాయణ, సంపత్‌రెడ్డి ప్రకటనలో విడుదల చేశారు. తాను తలుచుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో సగం పత్రికలు,TVచానళ్లను మూసి వేయిస్తానని హెచ్చరించే ధోరణిలో వ్యాఖ్యానించడాన్ని సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే వ్యాఖ్యలను వాపస్ తీసుకున్నట్లు ప్రకటించాలన్నారు.

News January 8, 2025

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: నిర్మల్ SP

image

నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్రకటనలో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా వాడితే ప్రజలు, జంతువులకు ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైనా మాంజా కట్టడికి పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

News January 7, 2025

ADB డీఈఓను పరామర్శించిన కలెక్టర్

image

ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి ప్రణీతకు గుండెపోటు వచ్చిన నేపథ్యంలో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా మంగళవారం ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి డీఈఓ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, తదితరులున్నారు.

News January 7, 2025

మంచిర్యాల: సాఫ్ట్ వేర్ దంపతుల సూసైడ్

image

ఓ సాఫ్ట్ వేర్ దంపతులు సూసైడ్ చేసుకున్న ఘటన HYDలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. మియాపూర్‌కు చెందిన సందీప్, మంచిర్యాలకు చెందిన కీర్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3ఏళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప బర్త్ డే విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. అనంతరం సందీప్ బయటకు వెళ్లి తిరిగొచ్చే సరికి ఇంట్లో కీర్తి ఉరేసుకుని కనిపించింది. దీంతో మనస్తాపం చెందిన సందీప్ సూసైడ్ చేసుకున్నాడు.

News January 7, 2025

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 29 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.