India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కరెంట్ షాక్‌తో ADBకు చెందిన బాలిక మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న తహ్రీం గత నెల 18న తన ఇంటి డాబా పైకి వెళ్లింది. ఈ క్రమంలో డాబాపై నుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబీకులు రిమ్స్‌కు, అక్కడి నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం బాలిక మృతి చెందింది.

పైలెట్ ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాజస్థాన్ నుంచి వచ్చిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ నిఖిల్ డేతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందనడంతో కలెక్టర్‌ను వారు అభినందించారు.

ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.

ఆదిలాబాద్ డివిజన్‌లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ADB జిల్లాలో ఇంటర్ ఆపైన చదువుతున్న పోస్ట్ మెట్రిక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలకు ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని DSCDO సునీత కుమారి తెలిపారు. రినివల్, ఫ్రెష్ పోస్ట్మెట్రిక్ విద్యార్థులు 31 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపకారవేతనములు పొందేందుకు SSC మెమో, ఆధార్ కార్డులలోని పేరు ఒకేలా ఉండాలన్నారు.

వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురవుతున్నారు. మూడు రోజుల కిందట నార్నూర్ మండలంలోని వ్యాపారి ఇంట్లో రూ.2 లక్షలు చోరీ కాగా ఇంద్రవెల్లిలోని వెంకటి ఇంట్లో రూ.8లక్షలు చోరీ ఆయ్యాయి. కూతురు పెళ్లి కోసం రూ.8 లక్షలు జమ చేసి ఇంట్లో ఇనుప పెట్టెలు దాచానని శనివారం గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని వెంకటి ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్‌గా ADBకు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం HYDలో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాల్లో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ డైరెక్టర్‌గా ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు.

2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ చదువుతున్న SC, ST, BC, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ADB జిల్లా SC అభివృద్ధి శాఖాధికారి బి.సునీత కుమారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. రెన్యూవల్, కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు E-Pass ఆన్ లైన్‌లో మార్చి 31 లోపుగా సమర్పించాలన్నారు.

క్షయ వ్యాధి (టీబీ) రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలని ఆదిలాబాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి సుమలత అన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఆక్యు పంచర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్, మంజునాథ్, రఘు ఆయుర్వేద, ఆక్యు పంచర్ వైద్య విధానంలోని పలు అంశాలపై అవగాహన కల్పించారు.
Sorry, no posts matched your criteria.