India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDRA బలోపేతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. GHMC, HMDAలో పోలీస్ శాఖ నుంచి 188 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. వీటికి తోడు 1,490 నూతన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ అవుట్‌సోర్సింగ్ పద్ధతిన జరగనుంది. GHMC ప్రాంతం నుంచి ORR వరకు అర్బన్ కోర్ రీజియన్ ప్రాంతంగా గుర్తించిన ప్రభుత్వం, HYD డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ సంస్థను ఏర్పాటు చేసింది.
HYDలో మరో దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోరబండ పీఎస్ పరిధి కార్మికనగర్‌లోని NI-MSME గ్రౌండ్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు దాడి చేసి, అతడి గొంతుకోసి హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నగరం మొత్తం ఇక సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండనుంది. HYD కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ సర్వైలెన్స్ కోసం రూ.50 కోట్లు, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రూ.18 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సేఫ్టీ ప్రాజెక్టులో భాగంగా మహిళ భద్రత కోసం నిర్భయ కింద ప్రత్యేక కేటాయింపులు జరిపింది. నగరాన్ని భద్రతా వలయంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపింది.
TGSPDCL పరిపాలన సౌలభ్యం రీత్యా మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లుగా విభజించారు. దాదాపుగా అన్ని విభాగాల్లో విద్యుత్ కనెక్షన్లు 60 లక్షలకు పైగా దాటాయి. వీటి నుంచి దాదాపు ఏటా రూ.23,000 కోట్ల బిల్లింగ్ డిమాండ్ వస్తుండగా.. ఈ ఏడాది రూ.24,000 కోట్ల బిల్లింగ్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీఎస్సీ (హన్స్) మొదటి ఏడాది ప్రవేశం కోసం ఈ నెల 12న ఆన్ లైన్‌లో అప్లికేషన్లు తీసుకుంటామని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఈఏపీసెట్- 2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం MMTS రెండో దశ పనుల కోసం దాదాపు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. సీతాఫల్మండి, మౌలాలి మధ్య రెండో లైన్ నిర్మాణం, సికింద్రాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, ఘట్‌కేసర్, మౌలాలి, సనత్ నగర్, లింగంపల్లి, తెల్లాపూర్ మార్గాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లభించనుంది. ఈ మార్గాల్లో 10 MMTS రైళ్ల వరకు కొనేందుకు వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ HYD నగర ప్రజలకు జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వికారం, చలి లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను సంప్రదించాలని సూచించింది. ఇవన్నీ మలేరియా లక్షణాలని పేర్కొంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా కుండీలు పాత్రలో నిల్వ ఉన్న నీటిని తొలగించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు రహదారుల మధ్యలో.. లేదంటే ఇరువైపులా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం సర్వీస్ మార్గాలను ఏర్పాటు చేసేందుకు వీలుందని HMDA అధికారులు తెలిపారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నాలెడ్జి సిటీ వరకు 17KM, రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఆర్థిక జిల్లా వరకు 15KM, కాచిగూడ ఎంజీబీఎస్ జూపార్క్ ఎయిర్‌పోర్ట్ వరకు 20KM అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా.. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోనే 109 కళాశాలలున్నాయి. అంటే 69% సీట్లు అక్కడే ఉన్నాయని అధికారులు తెలిపారు. CSE కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచ్లో రాష్ట్రంలో 69% సీట్ల ప్రవేశాలు జరిగాయని, దీంతో కోర్ బ్రాంచులకు గండిపడుతోందన్నారు. కోర్ బ్రాంచీలపై ఆసక్తి పెంచేందుకు నూతన ఆవిష్కరణలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
HYD శివారు బీబీనగర్ AIIMS 2023-24 సంవత్సరానికి సంబంధించి 3,65,395 మంది అవుట్ పేషెంట్లు, 7,953 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 750 పడకల సామర్థ్యం ఉన్న ఈ సంస్థలో ప్రస్తుతం 20 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ వంద మంది ఎంబీబీఎస్, 30 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు చదువుతున్నారు.
Sorry, no posts matched your criteria.